పిఠాపురం: కూర్పుల మధ్య తేడాలు

district
temples
పంక్తి 4:
east godavari
 
=temples
==పాదగయ క్షేత్ర వివరణ==
[[File:Padhagaya kshetram-Pithapuram - Eastgodavari District of A.P.jpg|thumb|Padhagaya kshetram - Pithapuram - Eastgodavari District of A.P]]
కుక్కుటేశ్వరుడి [[గుడి]]<nowiki/>కి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. [[గంగా నది|గంగా]] తీరమున ఉన్న [[గయ]] "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే [[గంగ]]<nowiki/>లో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. గయునికి సంబంధించిన ఒక కథనం ప్రకారం గయుని చావు తరువాత చచ్చిన శవం యొక్క బుర్ర సింహాచలం దగ్గర, పాదాలు పిఠాపురం దగ్గర పడ్డాయిట. అందుకని [[సింహాచలం]] నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రదేశం పాపభూమి అనేవారు. పాపభూమి కాబట్టే ఈ మధ్య ప్రదేశంలో పుణ్య క్షేత్రాలు లేవుట. అన్నవరం తదనంతర కాలంలో ప్రశస్తి చెందినది. అందువలననే శ్రీనాథుని రచనలలో ఎక్కడా [[అన్నవరం]] చరిత్ర కనబడదు.
 
===కుక్కుటేశ్వర దేవాలయం===
ఈ [[దేవాలయం]] కోనేరుకు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. దేవాలయం ఎదురుగా కల ఏకశిల [[నంది]] అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొద్దిగా దిగువగా ఉంటుంది. ఈ ఆలయానికి రెండు వైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి.
 
===పురుహూతికా దేవి ఆలయం===
{{ప్రధాన వ్యాసం|పురుహూతికా క్షేత్రం}}
కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో '''పురుహూతికా దేవి''' ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. [[భారత దేశము|భారతదేశం]] లోని [[శక్తి పీఠాలు|అష్టాదశ మహా శక్తి పీఠములలో]] ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి '''పీఠికాపురం''' అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.
 
=== శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం===
పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం,శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం"గా ఏర్పాటు చేయబడింది, శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ [[దత్తాత్రేయ స్వామి|దత్తాత్రేయు]]<nowiki/>ల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు,భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు,మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి [[పాదుకలు]] ఉన్నాయి.
 
===[[షిరిడి సాయి]] గురు మందిరం===
 
===[[కాలభైరవ|కాలభైరవుడు]] ఆలయం===
ఈ కుక్కుటేశ్వరుడి ఆలయ ప్రాంగణం లోనే [[కాలభైరవుడు|కాలభైరవుడి]] విగ్రహం "వ్రీడావిహీనజఘనమై" చూసేవారికి సిగ్గును కలిగించేదిగా ఉంది.
 
===కుంతి మాధవస్వామి ఆలయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి)===
 
===ఇతర ఆలయాలు===
[[దస్త్రం:Pithapuram .jpg|right|250px|thumb|పాదగయ క్షేత్రం (కుక్కుటేశ్వర స్వామి)]]
[[దస్త్రం:Padagaya.jpg|right|250px|thumb|కుక్కుటేశ్వర స్వామి]]
[[దస్త్రం:Puruhutika ammavaru.jpg|250px|right|thumb|పురుహూతికా దేవి]]
 
===పిఠాపురంలో ఇతర ఆలయాలు===
* వేణు గోపాలస్వామి ఆలయం,
* నూకాలమ్మ గుడి ([[గ్రామదేవత]])
* [[కుక్క]] [[పాము]]గుడి (సీతయ్యగారి తోట)
* రాముని కోవెల (మంగాయమ్మరావు పేట)
* [[వెంకటేశ్వరస్వామి]] గుడి (కుక్కుటేశ్వరస్వామి ఆలయం వద్ద)
* [[కోతి|ఆంజనేయ స్వామి గుడి (కోతి]] గుడి) (మార్కెట్ వద్ద)
* సాయిబాబా గుడి (చిన్న పోస్టాఫీస్ వద్ద)
* పురుహూతికా అమ్మవారు (పాత బస్ స్టాండ్ వద్ద)
* కోట సత్తెమ్మ తల్లి గుడి (సీతయ్యగారి తోట)
* శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం (పాత బస్టాండ్ వద్ద)
* శ్రీ సకలేశ్వర స్వామి గుడి (నూకాలమ్మ గుడి ప్రక్కన )
* శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం (వేణుగోపాలస్వామి గుడి వద్ద)
* దత్తాత్రేయుడి గుడి (దూళ్ళ సంత దగ్గర, అగ్రహారం)
 
=== చర్చిలు===
ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి, బెతెస్థ బాప్టిస్ట్ చర్చి, ఎల్-షద్దాయి మినిస్ట్రీస్ చర్చి, జియన్ ప్రార్థనా మందిరం, హౌస్ ఆఫ్ హోప్, బైబిల్ మిషన్ చర్చి, ట్రినిటీ లూథరన్ చర్చి, డోర్ ఆఫ్ హోప్ చర్చి, సెవెన్త్ డే అడ్వెంటిస్ట్ చర్చి, మరి కొన్ని
 
==సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/పిఠాపురం" నుండి వెలికితీశారు