సిద్ధవటం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 70:
 
==సిద్ధవటం కోట==
పవిత్ర పెన్నానది ఒడ్డున క్రీ.పూ. 40-30 సంవత్సరాల మధ్యకాలంలో సిద్దవటం కోట రూపుదిద్దుకుంది. సుమారు 36 ఎకరాలపైబడి విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కోటను 18 రాజవంశీయులు పాలించారు. మౌర్యుల నుంచి తూర్పు ఇండియా వర్తకసంఘం వరకూ ఈ కోటను పాలించారు. 1543 నుంచి 1579 వరకూ సాగిన పాలనను స్వర్ణయుగంగా పరిగణిస్తారు. 1605 వరకూ ఉన్న మట్టి కోట కాస్తా రాతికట్టడంగా మారింది. క్రీ.శ. 1792లో టిప్పుసుల్తాన్‌ చేతి నుంచి నైజాము నవాబుల పాలనలోకి, వారి నుంచి 1880లో తూర్పు ఇండియా వర్తకసంఘం ఆధీనంలోకి ఈ కోట చేరింది. [[బ్రిటిష్‌]]పాలనలోబ్రిటిష్‌పాలనలో 1808 నుంచి 1812 వరకూ ఇది తొలి జిల్లా కేంద్రంగా ఉండి, పరిపాలన కేంద్రంగా భాసిల్లింది.
ఇక్కడ మధ్యయుగం నాటి కోట ఒకటి ఉంది. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది.
మట్లి రాజులు [[నాయంకరం]]గానాయంకరంగా ఈ కోటను పాలించే నాటికి ఇది మట్టి కోట. [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] అల్లుడు [[వరదరాజు]] మొదట ఈ కోటను పాలించాడు. అంతకు ముందు ఈ కోట [[ఉదయగిరి]] రాజ్యంలో ఉండేది. [[రెండవ వెంకటపతిరాయలు|రెండవ వెంకటపతిరాయల]]కు మట్లి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు. అందుకు గుర్తుగా ఎల్లమరాజుకు అమరనాయంకరంగా సిద్ధవటాన్ని ఇచ్చాడు. మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేర ఎల్లమరాజు చెరువును, తన పేర అనంతరాజు చెరువును త్రవ్వించాడు. అనంతరాజు 'కకుత్‌స్థ విజయము ' అనే కావ్యాన్ని రచించాడు. ఈయన ఆస్థానంలో ఉప్పుగుండూరు వెంకటకవి, కవి చౌడప్ప ఉండేవారు.
మట్లి రాజుల పతనం తర్వాత [[ఔరంగజేబు]] సేనాని [[మీర్ జుమ్లా]] సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత [[ఆర్కాటు నవాబులు]] సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. మయానా నవాబులు సిద్ధవటాన్ని పాలించారు. 1799లో సిద్ధవటం ఈస్టిండియా కంపెనీ వశమయింది.<ref name="సూర్య">{{cite news|title=శిల్పకళా తోరణం.. సిద్ధవటం|url=http://www.suryaa.com/features/article.asp?subCategory=5&ContentId=89051|accessdate=29 December 2014|agency=సూర్య|publisher=సూర్య|date=జూలై 10, 2012}}</ref>
'''కోట:''' కోటకు పడమట, తూర్పున రెండు ద్వారాలున్నాయి.ముఖద్వారం ఇరువైపులా [[ఆంజనేయుడు]], [[గరుత్మంతుడు]] శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం లోపలి పైభాగాన రాహు గ్రహణం పట్టువిడుపులు ఉన్నాయి. కోట మధ్య భాగంలోని అంతఃపురం శిథిలమై ఉంది. రాణి దర్బారు, [[ఈద్గా]] మసీదు, సమీపంలో నగారాఖానా ఉన్నాయి. నగారాఖానా వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు ఉంది. కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం ఉన్నాయి. శిథిలమవుతూ ఉన్న [[కామాక్షి]] ఆలయాన్ని మరమ్మత్తులు చేసి ఉంచారు. తూర్పు ద్వారానికి సమీపంలో బిస్మిల్లా షావలి దర్గా ఉంది. [[టిప్పు సుల్తాన్]] కాలంలో దీన్ని నిర్మించారు. ప్రక్కనే మసీదు ఉంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో సొరంగ మార్గాన్ని ఏట్లోకి నిర్మించారు. చక్రయంత్రం ద్వారా ఏట్లో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవారు.
"https://te.wikipedia.org/wiki/సిద్ధవటం" నుండి వెలికితీశారు