దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''దక్షిణ విజయపురి''' [[గుంటూరు జిల్లా]], [[మాచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన మాచర్ల నుండి 27 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1763 ఇళ్లతో, 8393 జనాభాతో 4704 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4597, ఆడవారి సంఖ్య 3796. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2291 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1319. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589798<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_1200.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522426. ఎస్.టి.డి.కోడ్ = 08647.
 
==గ్రామ భౌగోళికం==
ఇది [[నాగార్జున సాగర్]] ఆనకట్టకు [[దక్షిణం]] వైపున్న నివాస ప్రాంతం.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల ఉన్నాయి.
 
సమీప ఇంజనీరింగ్ కళాశాల అలుగురాజుపల్లిలో ఉంది.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.
 
=== ఏ.పి.ఆర్.డి.సి.కళాశాల ===
ఈ [[కళాశాల]]<nowiki/>కు చెందిన వాణిజ్య శాస్త్రం అధ్యాపకులు శ్రీ ఎం.వి.రమణ, 2015, సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా [[విశాఖపట్నం]]<nowiki/>లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర [[ముఖ్యమంత్రి]] [[నారా చంద్రబాబునాయుడు]] చేతులమీదుగా, ఉత్తమ ఉపాధ్యాయ [[పురస్కారం]] అందుకున్నారు. [10]
Line 108 ⟶ 105:
 
ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ప్రమీలాబాయి, 9వ తరగతి చదువుచున్న సువార్త, పదవ తరగతి చదువుచున్న పుష్పలత అను విద్యార్థినులు, బేస్ బాల్ జాతీయపోటీలకు అండర్-17 విభాగంలో ఎంపికైనారు. ప్రస్తుతం [[నెల్లూరు]]<nowiki/>లోని శిక్షణా శిబిరంలో [[శిక్షణ]] పొందుచున్న వీరు, 2016, ఫిబ్రవరి-3 నుండి 6 వరకు, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు. [14]
 
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
కృష్ణా తీరం సాగర్ జలాశయం వెంట ఉన్నఈ గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేశారు. ఈ పాఠశాల కార్పొరేటు పాఠశాలలను తలపించేలాగా ఉంది. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. పదవ తరగతిలో గూడా ఉత్తీర్ణతా శాతం చాలా బాగున్నది. ఈ పాఠశాల [[స్వర్ణోత్సవాలు|స్వర్ణోత్సవా]]<nowiki/>లు, 2013 డిసెంబరు 13,14 తేదీలలో జరిగినవి. 400 మందికిపైగా పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రామానికి హాజరై, తమ బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులతోపాటు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీ పందిరి వెంకటేశ్వర్లుని సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] కార్య కలాపాలు, ఆటల పోటీలు నిర్వహించారు. పేద విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిన పూనారు. ఈ పాఠశాలలో 2014, జూలై-2, బుధవారం నాడు, దాతలు, పూర్వవిద్యార్థుల వితరణతో ఒక శుద్ధజలకేంద్రాన్ని (Mineral Water Plant) ప్రారంభించారు. [2] & [6]
Line 114 ⟶ 110:
ఈ పాఠశాల [[రజతోత్సవం|రజతోత్సవ]] వేడుకలు 2015, ఫిబ్రవరి-25వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. [7]
===పి.టి.జి.పాఠశాల===
 
== వైద్య సౌకర్యం ==
 
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
గ్రామంలో 2 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి. ఇద్దరు డిగ్రీ లేని డాక్టర్లు ఉన్నారు.
 
== తాగు నీరు ==
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది.
 
== పారిశుధ్యం ==
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
 
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
విజయపురి దక్షిణలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది.సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
Line 135 ⟶ 125:
 
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
 
వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.వారం వారం సంత గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
===బ్యాంకులు===
#[[స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు]].
#కెనరా బ్యాంక్.
 
==ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు==
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
== భూమి వినియోగం ==
విజయపురి దక్షిణలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
Line 164 ⟶ 148:
విజయపురి దక్షిణలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది
* బావులు/బోరు బావులు: 10 హెక్టార్లు
 
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ దోసపాటి అంజయ్య, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [9]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల దేవాలయం. [4]
Line 181 ⟶ 163:
#చాకలిగట్టు:- నాగార్జునకొండకు సమీపంలో ఉన్న చాకలిగట్టుపై, 25 కృష్ణజింకలను అటవీశాఖ సంరక్షణలో పెంచుచున్నారు. చాకలిగట్టుపై [[విద్యుత్తు]] కాంతులను ఏర్పాటుచేసి, దీనిని ఒక పర్యాటకప్రాంతంగా అభివృద్ధిచేయడానికై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. [14]
#స్థానిక విజయపురిలోని టి-జంక్షనులో ఈ ఆలయాలు నెలకొని యున్నవి:- శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, మాతా అన్నపూర్ణేశ్వరీదేవి ఆలయం. శ్రీ కాశినాయనస్వామివారి ఆలయం. ఈ ఆలయాల ప్రాంగణంలో, 2017, జూన్-3వతేదీ శనివారంనాడు, నవగ్రహ మండపం ప్రాంభించారు. [17]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ బండారు రామకృష్ణ===
దక్షిణ విజయపురి గ్రామానికి చెందిన వీరు, ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలోని [[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్‌నగర్‌]]<nowiki/>లోని [[పాలమూరు]] విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహించుచున్నారు. ఈ ఫెలోషిప్ క్రింద మంజూరయ్యే నిధులతో, ఇటీవల [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం]] ప్రవేశపెట్టిన '''ఇ-జాతీయ వ్యవసాయ మార్కెట్ ''' అను అంశంపై పరిశోధన చేస్తున్నారు. వీరు ప్రతిష్ఠాత్మక జాతీయ యు.జి.సి. పోస్ట్ డాక్టొరేట్ ఫెలోషిప్‌కు, కామర్స్ విభాగంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున ఎంపికైనారు. జాతీయస్థాయిలో మొత్తం ముగ్గురిని ఎంపికచేయగా, ఆ ముగ్గురిలో వీరొక్కరు. తెలంగాణా రాష్ట్రం నుండి ఎంపికైన ఏకైక వ్యక్తి ఈయన కావడం గమనార్హం. వీరు వ్యవసాయ మార్కెట్ మీద పరిశోధనలు చేసి, దానిని రైతులకు మరింత ఉపయోగకరంగా విస్తరించేలాగా చేయాలని వీరి సంకల్పం. [16]
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 8,393 - పురుషుల సంఖ్య 4,597 - స్త్రీల సంఖ్య 3,796 - గృహాల సంఖ్య 1,763
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,124.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,334, స్త్రీల సంఖ్య 3,790, గ్రామంలో నివాస గృహాలు 1,643 ఉన్నాయి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013, డిసెంబరు-15; 5వపేజీ.
Line 217 ⟶ 193:
[16] ఈనాడు గుంటూరు రూరల్; 2017, ఏప్రిల్-23; 16వపేజీ.
[17] ఈనాడు గుంటూరు రూరల్; 2017, జూన్-4; 7వపేజీ.
 
{{మాచెర్ల మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు