మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
== కథ ==
నిరుద్యోగంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు యువకులు చక్రి (జె.డి.చక్రవర్తి), బోస్ (చిన్నా) తమ ఇంటి పక్క బంగాళాలో ఉండే కోటీశ్వరురాలు విజయ(జయసుధ)ని కిడ్నాప్ చేస్తారు. ఆమె ఆస్తి కోసం ఎప్పటి నుంచో ఆశిస్తున్న ఆమె భర్త సుబ్బారావు (పరేష్ రావల్) బయటకి ఆమె కిడ్నాప్ అయినందుకు బాధపడ్డా, లోలోపల అక్కడే చంపేయాలని ప్రయత్నాలు సాగిస్తాడు. దీంతో చక్రి, బోస్ కలిసి విజయను రక్షించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. చివరకు విజయకు సుబ్బారావు నిజస్వరూపాన్ని తెలియబరచడంతో, ఆమె కంపెనీలోనే వారిద్దరికీ ఉద్యోగం వస్తుంది.
 
== స్పందన ==
సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీనికి కొనసాగింపుగా 1993లో వర్మ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలోనే శివనాగేశ్వరరావు దర్శకునిగా [[మనీ మనీ]] సినిమా, దానికి కొనసాగింపుగా 2011లో జె.డి.చక్రవర్తి నిర్మాణ దర్శకత్వంలో [[మనీ మనీ మోర్ మనీ]] సినిమా తీశారు.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు