మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''మనీ''' [[శివనాగేశ్వరరావు]] దర్శకత్వంలో, [[రామ్ గోపాల్ వర్మ]] నిర్మాతగా నిర్మించిన 1993 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. [[జె. డి. చక్రవర్తి]], [[చిన్నా]] కథానాయకులుగా, [[జయసుధ]], [[పరేష్ రావెల్]], [[కన్నెగంటి బ్రహ్మానందం]] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. హాస్యదర్శకుడిగా పేరొందిన శివనాగేశ్వరరావుకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. 1986 నాటి హాలీవుడ్ క్రైం కామెడీ సినిమా ''రూత్ లెస్ పీపుల్'' సినిమా ఆధారంగా ఈ కథ, కొన్ని పాత్రలను రూపొందించారు. డబ్బు కోసం పక్క ఇంట్లోని సంపన్నురాలిని కిడ్నాప్ చేసిన నిరుద్యోగ యువకులే ఆమె ఆస్తి కోసం చంపాలని చూస్తున్న భర్త నుంచి కాపాడడం ప్రధాన కథాంశం. సినిమా నిర్మాణం తర్వాత ఎంతమంది పంపిణీదారులకు ప్రివ్యూ వేసినా నచ్చకపోతూండడంతో సినిమా విడుదల ఆలస్యమైంది. ఏదో విధంగా తుదకు విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయంతో దీనికి [[మనీ మనీ]] (1995), [[మనీ మనీ మోర్ మనీ]] (2011) సినిమాలు సీక్వెల్స్‌గా, "''లవ్ కే లియే కుఛ్ బీ కరేగా''" (2001) హిందీ రీమేక్‌గా వచ్చాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం పోషించిన [[ఖాన్ దాదా]] పాత్ర బ్రాండ్ స్థాయికి ఎదిగింది. {{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా |
 
పంక్తి 44:
సినిమా మంచి విజయాన్ని సాధించింది. నిర్మాణ వ్యయానికి ఐదారు రెట్లు రూ.3 కోట్లు వసూలు చేసింది.<ref name="Idle brain interview" /> ఈ విజయం అనంతరం దీనికి సీక్వెల్స్ వచ్చాయి.<ref name=":0" /> దీనికి కొనసాగింపుగా 1995లో వర్మ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలోనే శివనాగేశ్వరరావు దర్శకునిగా [[మనీ మనీ]] సినిమా, దానికి కొనసాగింపుగా 2011లో జె.డి.చక్రవర్తి నిర్మాణ దర్శకత్వంలో [[మనీ మనీ మోర్ మనీ]] సినిమా తీశారు.<ref name="webdunia more money2">{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%E0%B0%9C%E0%B1%86-%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%95%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-110071300045_1.htm|title=జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో ''మనీ మనీ మోర్ మనీ''|accessdate=15 January 2019|website=telugu.webdunia.com|archiveurl=https://web.archive.org/web/20190115024502/http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%25E0%25B0%259C%25E0%25B1%2586-%25E0%25B0%25A1%25E0%25B0%25BF-%25E0%25B0%259A%25E0%25B0%2595%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25B5%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25A4%25E0%25B0%25BF-%25E0%25B0%25A6%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25B6%25E0%25B0%2595%25E0%25B0%25A4%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%2582%25E0%25B0%25B2%25E0%25B1%258B-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-%25E0%25B0%25AE%25E0%25B1%258B%25E0%25B0%25B0%25E0%25B1%258D-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-110071300045_1.htm|archivedate=15 January 2019}}</ref> మనీ సినిమాని 2001లో "''లవ్ కే లియే కుఛ్ భీ కరేగా''" అన్న సినిమా పునర్నిర్మాణం చేశారు.<ref>[[imdbtitle:0287537|లవ్ కే లియే కుఛ్ భీ కరేగా ఐఎండీబీ పేజీ]]</ref>
 
ఈ సినిమాలో [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] నటించిన [[ఖాన్ దాదా]] పాత్ర బాగా ప్రేక్షకాదరణ పొంది బ్రాండ్ స్థాయికి ఎదిగింది. మనీ సినిమా విజయానికే కాక తదనంతరం సీక్వెల్స్ నిర్మాణానికి కూడా ఖాన్ దాదా పాత్ర కీలకమైన ఆకర్షణగా నిలిచింది.<ref name="Brand Money">{{cite book|url=https://books.google.com/books?id=aFJuDwAAQBAJ&pg=PA916|title=Brand Culture and Identity: Concepts, Methodologies, Tools, and Applications: Concepts, Methodologies, Tools, and Applications|date=5 October 2018|publisher=IGI Global|isbn=978-1-5225-7117-9|editor=Management Association, Information Resources|page=916|language=English}}</ref>
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు