మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
సినిమాను 55 లక్షల రూపాయల బడ్జెట్‌లో తెలుగు, హిందీ భాషల్లో సమాంతరంగా నిర్మించారు. పూర్తయ్యాకా సినిమాను విడుదల చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చూసిన పంపిణీదారులకు ఎవరికీ సినిమా నచ్చకపోతూండడంతో అన్నపూర్ణ స్టూడియోకి చెందిన ప్రివ్యూ థియేటర్‌లో 50 రోజుల పాటు సినిమాను ప్రివ్యూ వేసి చూపించాల్సి వచ్చింది. దర్శకుడు శివనాగేశ్వరరావు "ఒక దశలో మేము ఈ సినిమా ఎప్పటికీ విడుదల కాదేమో అనుకున్నాము" అని చెప్పాడు. ఆ ఇబ్బందులు అధిగమించి సినిమా ఎట్టకేలకు విడుదలైంది.<ref name="Idle brain interview" />
 
== స్పందన, ప్రాచుర్యం ==
సినిమా మంచి విజయాన్ని సాధించింది. నిర్మాణ వ్యయానికి ఐదారు రెట్లు రూ.3 కోట్లు వసూలు చేసింది.<ref name="Idle brain interview" /> ఈ విజయం అనంతరం దీనికి సీక్వెల్స్ వచ్చాయి.<ref name=":0" /> దీనికి కొనసాగింపుగా 1995లో వర్మ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలోనే శివనాగేశ్వరరావు దర్శకునిగా [[మనీ మనీ]] సినిమా, దానికి కొనసాగింపుగా 2011లో జె.డి.చక్రవర్తి నిర్మాణ దర్శకత్వంలో [[మనీ మనీ మోర్ మనీ]] సినిమా తీశారు.<ref name="webdunia more money2">{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%E0%B0%9C%E0%B1%86-%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%95%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%80-110071300045_1.htm|title=జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో ''మనీ మనీ మోర్ మనీ''|accessdate=15 January 2019|website=telugu.webdunia.com|archiveurl=https://web.archive.org/web/20190115024502/http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%25E0%25B0%259C%25E0%25B1%2586-%25E0%25B0%25A1%25E0%25B0%25BF-%25E0%25B0%259A%25E0%25B0%2595%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25B5%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25A4%25E0%25B0%25BF-%25E0%25B0%25A6%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25B6%25E0%25B0%2595%25E0%25B0%25A4%25E0%25B1%258D%25E0%25B0%25B5%25E0%25B0%2582%25E0%25B0%25B2%25E0%25B1%258B-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-%25E0%25B0%25AE%25E0%25B1%258B%25E0%25B0%25B0%25E0%25B1%258D-%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2580-110071300045_1.htm|archivedate=15 January 2019}}</ref> మనీ సినిమాని 2001లో "''లవ్ కే లియే కుఛ్ భీ కరేగా''" అన్న సినిమా పునర్నిర్మాణం చేశారు.<ref>[[imdbtitle:0287537|లవ్ కే లియే కుఛ్ భీ కరేగా ఐఎండీబీ పేజీ]]</ref>
 
== ప్రాచుర్యం, పురస్కారాలు ==
ఈ సినిమాలో [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] నటించిన [[ఖాన్ దాదా]] పాత్ర బాగా ప్రేక్షకాదరణ పొంది బ్రాండ్ స్థాయికి ఎదిగింది. మనీ సినిమా విజయానికే కాక తదనంతరం సీక్వెల్స్ నిర్మాణానికి కూడా ఖాన్ దాదా పాత్ర కీలకమైన ఆకర్షణగా నిలిచింది.<ref name="Brand Money">{{cite book|url=https://books.google.com/books?id=aFJuDwAAQBAJ&pg=PA916|title=Brand Culture and Identity: Concepts, Methodologies, Tools, and Applications: Concepts, Methodologies, Tools, and Applications|last=రాసు|first=ఛత్రపతి యాదవ్|date=5 October 2018|publisher=IGI Global|year=|isbn=978-1-5225-7117-9|editor=Management Association, Information Resources|location=|page=916|pages=|language=English|chapter=Space of Culture and Brand in Sequel of Telugu Films: A Qualitative Study}}</ref> సీరియస్‌గా ప్రవర్తిస్తూ హాస్యాన్ని పండించే ఖాన్ దాదా పాత్ర బ్రహ్మానందం కెరీర్‌లోని మేలిమలుపుల్లో ఒకటిగా నిలిచింది.<ref name="Money money more money The Hindu">{{cite news|url=https://www.thehindu.com/features/metroplus/its-a-mad-mad-comedy/article2383392.ece|title=It's a mad mad comedy|last1=Narasimham|first1=M. l|date=22 August 2011|work=The Hindu|accessdate=15 January 2019|language=en-IN|archiveurl=https://web.archive.org/web/20190115062932/https://www.thehindu.com/features/metroplus/its-a-mad-mad-comedy/article2383392.ece|archivedate=15 January 2019}}</ref>
 
== పాటలు ==
మనీ సినిమాకు [[కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి|శ్రీ]] సంగీత దర్శకత్వం వహించాడు.<ref>https://wynk.in/music/album/money/hu_398504?page=0</ref> "చక్రవర్తికి వీధి భిక్షగత్తెకీ", "లేచిందే లేడికి పరుగు" పాటలు రెండూ [[ఎం. ఎం. కీరవాణి]] స్వరపరిచాడు. [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] ఈ సినిమాలో పాటలన్నీ రాశాడు. [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[కె. ఎస్. చిత్ర]], [[నాగూర్ బాబు|మనో]], తదితరులు పాటలు పాడారు.<ref>[https://cassettecovers.files.wordpress.com/2014/02/1993-money.jpg క్యాసెట్ కవర్]</ref> ఈ సినిమాలోని "వారేవా ఏమి ఫేసు", "భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ", "చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ" పాటలు మంచి ప్రాచుర్యం పొందాయి.<ref name="webdunia more money2" /> వీటిలో పెళ్ళి చేసుకుంటే మగాడికి వచ్చే కష్టాల గురించి వచ్చే "భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ" పాట, మగాళ్ళు పెళ్ళి గురించి సరదాగా వాపోయే సందర్భాల్లో తప్పక గుర్తువచ్చే పాటగా నిలిచిపోయింది.<ref>{{cite web|url=http://vijayakranthinews.com/news/article/2018/07/14/marriagecouplehyd/6902|title=సోదరా.. షాదీయే బెటర్|accessdate=15 January 2019|website=విజయక్రాంతి|archiveurl=https://web.archive.org/web/20190115062153/http://vijayakranthinews.com/news/article/2018/07/14/marriagecouplehyd/6902|archivedate=15 January 2019}}</ref><ref>{{Cite news|url=https://www.ntnews.com/Entertainment/manchu-vishnus-achari-america-yatra-movie-first-look-poster-unveiled-2-476174.aspx|title=ఆచారితో అమెరికా యాత్ర|date=18 March 2017|newspaper=నమస్తే తెలంగాణ}}</ref> ఈ పాట పదేళ్ళకొకటి వచ్చే మంచి సరదా పాటల్లో ఒకటిగా పేరొందింది.<ref name="పాటలు నవ్వులాటలు తానా">{{cite journal|last1=కె.వి.ఎస్.|first1=రామారావు|title=సినిమా పాటలు – నవ్వులాటలు|journal=తానా|date=2013|url=http://eemaata.com/em/library/tana2013/2171.html|accessdate=15 January 2019|location=ఈమాట}}</ref>
 
* చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది మనీ మనీ
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు