కొండారెడ్డి బురుజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 37:
 
== చరిత్ర ==
శ్రికృష్ణదేవరాయల కన్నా ముందు క్రీ.శ 1505-1509 మధ్య విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వీర నరసింహరాయలు కందనవీడు కోటను అరవీడు రామరాజుకు బహూకరించినట్లు "ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా" అనే పుస్తకం ద్వారా తెలుస్తూ ఉంది. ఈ తుళువవీర నరసింహారాయలునే ఇమ్మడి నరసనాయకుడు అని కూడా పిలుస్తారు. "కందనవోలు" కోట గురుంచి మొట్టమొదట కనపడేది ఇక్కడే. బీజాపూర్ సుల్తాను అయిన యూసుఫ్ ఆదిల్ ఖాన్ తుంగభద్రానదిని దాటుకొని కందనవోలు కోటపై దండెత్తాడు. ఆ సమయంలో తుళువవీరనరసింహునికి అండగా అరవీడు రామరాజు నిలబడి బీజాపూర్ సుల్తానును పారద్రోలి కందనవోలు కోటతో పాటు ఆదోనిని కూడా ఆక్రమించడానికి సహాయపడ్డాడు. దానితో విజయనగర ప్రభువైన వీరనరసింహుడు రామరాజును మెచ్చుకొని కందనవోలు కోటను అతనికి బహుమానంగా ఇచ్చాడు. అతడే కర్నూలు కోటను పటిష్టం చేసి, కొండారెడ్డి బురుజును నిర్మించి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం<ref>{{Cite web|url=https://historicalplacesandtemples.wordpress.com/about-kondareddy-buruju/|title=About Kondareddy Buruju|date=2016-10-01|website=HISTORICAL PLACES AND TEMPLES IN ANDHRA PRADESH|language=en|access-date=2019-01-16}}</ref>. కానీ అనేక మంది చరిత్రకారులు ఏమి చెబుతున్నారంటే [[కర్నూలు]]లో 1929-49 మధ్య [[శ్రీకృష్ణదేవరాయలు]] సోదరుదైన [[అచ్యుతదేవరాయలు]] విజయనగర రాజుగా ఉన్నప్పుడు ఈ కోటను కట్టించినట్లు అభిప్రాయపడుతున్నారు. కొండారెడ్డి బురుజును నిర్మించినది కూడా అతనేనని దీనిఅసలు పేరు అత్యుత దేవరాయ బురుజు అని తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ కొండారెడ్ది బురుజు విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మిచబడినదనడంలొ సందేహం లేదు. మనం ఎస్.పి కార్యాలయానికి కొండారెడ్డి బురుజు ప్రక్కనుండి వెళ్ళే గేటు దగ్గర నిలబడి ఆ బురుజు కోటను గనక గమనిస్తే పైన చిన్న చిన్న రంధ్రాలున్న ప్రదేశాల దగ్గర విజయనగర రాజులకు సంబంధించిన సింహం, ఏనుగు, గుర్రం లాంటి చిన్న చిన్న బొమ్మలు కనబడతాయి. కందనవోలు కోట మొత్తం మూడు చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, ఆరు అడుగుల ఎత్తుతో శత్రువుల నుండే కాక, తుంగభద్ర, హంద్రి నదుల వరదల నుండి కాపాడేటట్లు నిర్మిచారు. ఈ కోట చుట్టూ ఒక లోతైన కందకం కూడా ఉండేది. నగర విస్తరణలో భాగంగా బ్రిటిష్ కాలంలో ఈ కోట గోడలన్నీ తొలగించారు. తుంగభద్ర నదివైపు ఇప్పటికీ తీరం వెంట ఎత్తైన కోట గోడను గమనించవచ్చు.<ref>{{Cite book|title=కొండారెడ్డి బురుజు- ఎం.హరి కిషన్‌|last=|first=|publisher=కర్నూలు బుక్ ట్రస్టు|year=|isbn=|location=కర్నూలు|pages=}}</ref>
 
== కొండారెడ్ది బురుజుగా నామం ==
"https://te.wikipedia.org/wiki/కొండారెడ్డి_బురుజు" నుండి వెలికితీశారు