మాయలోకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
 
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో ఇద్దరు కథానాయికల పాత్రలకు శాంతకుమారి, రాజమ్మలను మొదటే దర్శకుడు నిర్ణయించేశాడు.<ref name=":1" /> బలరామయ్య సినిమాలో అప్పటికే హీరోగా పనిచేస్తున్న నాగేశ్వరరావును పరిశీలించేందుకు దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం బలరామయ్య ఆఫీసుకు వెళ్ళాడు. నాగేశ్వరరావు తనకు కనీసం నమస్కారమన్నా చేయలేదనీ, తన హీరోయిన్లు శాంతకుమారి, రాజమ్మల నడుమ అర్భకుడిలా ఉంటాడని హీరో పాత్ర ఇవ్వడానికి రామబ్రహ్మం నిరాకరించాడు. ఈలోగా వేరే నటులను కూడా ఆ పాత్ర కోసం పరిశీలించసాగాడు. చల్లపల్లి రాజా, మధుసూదనరావులు నాగేశ్వరరావు తరఫున రామబ్రహ్మంతో మాట్లాడి ఒప్పించడంతో, మేకప్ టెస్టు చేసి నాగేశ్వరరావును హీరోగా తీసుకున్నాడు.<ref>{{cite magazine|last=కుటుంబరావు|first=కొడవటిగంటి|date=నవంబరు 1952|title=అక్కినేని నాగేశ్వరరావు (స్కెచ్)|url=http://eemaata.com/em/issues/201205/1945.html|magazine=కినిమా|publisher=చందమామ పబ్లికేషన్స్|access-date=17 January 2019|location=మద్రాసు}}</ref> మిగిలిన ముఖ్యపాత్రలకు గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, హాస్యపాత్రలకు సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, లంక సత్యం ఎంపికయ్యారు. [[కమలా కోట్నీస్]] రంగసాని పాత్ర చేయడానికి అంగీకరించినా, అంతకుముందే చెంచులక్ష్మిలో గిరిజనురాలి పాత్ర చేసివుండడంతో ఇదీ చేస్తే ఆ తరహా పాత్రలే వస్తాయని సినిమా నుంచి తప్పుకుంది. ఆ పాత్రకు ఎస్.వరలక్ష్మిని తీసుకున్నారు.<ref name=":1" />
 
=== చిత్రీకరణ ===
సినిమాని మద్రాసులో న్యూటోన్ స్టూడియోస్‌లో చిత్రీకరించారు.<ref name=":1" />
 
==పాటలు==
[[ఫైలు:SVaralaxmi in Mayalokam.jpg|right|thumb|[[మాయాలోకం]] సినిమాలో రంగసాని పాత్ర పోషించిన ఎస్.వరలక్ష్మి]][[File:Cheliya Manakelane - Mayalokam (1945) - Bezawada Rajaratnam, S.Varalakshmi.opus|thumb|మాయలోకం సినిమాలో ఎస్.వరలక్ష్మి, బెజవాడ గోపాలరత్నం పాడిన చెలియా మనకేలనే]]మాయలోకం సినిమాకి [[గాలి పెంచల నరసింహారావు|గాలిపెంచల నరసింహారావు]] సంగీత దర్శకత్వం వహించాడు.<ref name=":1" /> "మందులున్నాయి బాబూ, చాలా మందులున్నాయి. మంచు కొండల నుంచి తీసిన మందులున్నాయి..." అనే పాట. ''రామ చాలింక నీదు బీరముల్‌'' అనే పద్యం కూడా అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ఆలపించాడు.<ref name=":0">[http://www.prabhanews.com/tvtalk/article-151760 “మాయలోకం"కి 65 - ఆంధ్రప్రభ అక్టోబర్ 7, 2010]</ref>
 
# చెలియా మనకేలనే వారి జోలి -
"https://te.wikipedia.org/wiki/మాయలోకం" నుండి వెలికితీశారు