మాయలోకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
== విడుదల, స్పందన ==
సమకాలీన సాంఘికాంశాల మీద అభ్యుదయకరమైన సినిమాలు తీసి పేరుతెచ్చుకున్న గూడవల్లి రామబ్రహ్మం తన సినిమాల వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, సినిమా రంగంలో నిలబడడానికి మాత్రమే ఈ సినిమా తీశానని చెప్పుకున్నాడు. తన స్థాయికి తగిన సబ్జెక్టు కాదని భావించిన రామబ్రహ్మం తాను ఎప్పుడూ చేసినట్టు కాక ప్రీమియర్ షోను వేరే థియేటర్‌లో వేశాడు. మెట్టు దిగివచ్చి ఈ సినిమాని తీసిన రామబ్రహ్మానికి ఆశించిన ఆర్థిక ఫలితం మాత్రం దక్కింది. సినిమా ఆర్థికంగా మంచి విజయాన్ని సాధించింది. భారీ బడ్జెట్‌లో చిత్రీకరించినా, పెట్టిన పెట్టుబడికి మించి కలెక్షన్లు సాధించి రామబ్రహ్మానికి ఉపశమనం ఇచ్చింది.<ref name=":1" />
==పాటలు==
[[ఫైలు:SVaralaxmi in Mayalokam.jpg|right|thumb|[[మాయాలోకం]] సినిమాలో రంగసాని పాత్ర పోషించిన ఎస్.వరలక్ష్మి]][[File:Cheliya Manakelane - Mayalokam (1945) - Bezawada Rajaratnam, S.Varalakshmi.opus|thumb|మాయలోకం సినిమాలో ఎస్.వరలక్ష్మి, బెజవాడ గోపాలరత్నం పాడిన చెలియా మనకేలనే]]మాయలోకం సినిమాకి [[గాలి పెంచల నరసింహారావు|గాలిపెంచల నరసింహారావు]] సంగీత దర్శకత్వం వహించాడు. అక్షయలింగవిభో, ఎవరోయీ నీవెవవరోయీ, మోహనాంగ రార వంటి పాటలు ప్రజాదరణ పొందాయి.<ref name=":1" /> "మందులున్నాయి బాబూ, చాలా మందులున్నాయి. మంచు కొండల నుంచి తీసిన మందులున్నాయి..." అనే పాట. ''రామ చాలింక నీదు బీరముల్‌'' అనే పద్యం కూడా అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ఆలపించాడు.<ref name=":0">[http://www.prabhanews.com/tvtalk/article-151760 “మాయలోకం"కి 65 - ఆంధ్రప్రభ అక్టోబర్ 7, 2010]</ref>
"https://te.wikipedia.org/wiki/మాయలోకం" నుండి వెలికితీశారు