మాయలోకం: కూర్పుల మధ్య తేడాలు

#1Lib1Ref
పంక్తి 29:
 
==సంక్షిప్త కథ==
శాంభవీ పురానికి రాజు కాంభోజరాజు. ఆ రాజుకు ఏడుగురు భార్యలు. దానవాది రాజకుమార్తెలు ఆరుగురు. నేత్రవాది రాజ కుమార్తె మాణిక్యాల దేవి ఏడవ భార్య. ఆమె శివభక్తురాలు. కైలాసంలోకి శని ప్రవేశించి మహారాజులను పట్టి వాళ్ళ సౌఖ్యాలను అనుభవించే వరం ఇవ్వాలని శివుడిని ప్రార్థిస్తాడు. తన భక్తుడైన, సంతానహీనుడైన కాంభోజ మహారాజును పట్టి పీడించమని చెబుతాడు. తర్వాత శివుడి మీద రాజుకు కోపం వచ్చి శివుడి విగ్రహాలు కోటలో ఉండకూడదని ఆజ్ఞాపిస్తాడు. కర్మశర్మ రూపంలో శని రాజ్యంలోకి ప్రవేశించి మహారాజుని ముప్పుతిప్పలు పెడతాడు. కర్మశర్మ వరప్రసాదంతో రాజుగారి ఆరుగురు భార్యలు అవివేకులు, అప్రయోజకులు అయిన కొడుకుల్ని కంటారు. ఏడవ భార్య మాణికాంబదేవికి పుట్టే సంతానం రాజు అవుతాడని రాజగురువు జోష్యం చెప్పడం వల్ల అసూయతో మిగిలిన భార్యలు గర్భవతిగా వున్న ఆమెను చంపే ప్రయత్నంలో అడవికి పంపిస్తారు. అడవిలో కాంభోజరాజు చిన భార్య మగ శిశువును ప్రసవిస్తుంది. ఆ శిశువే ఎదిగి సాహసోపేతుడైన శరాబందిరాజు (అక్కినేని). రాజు పశ్చాత్తాపంతో విచారగ్రస్తుడై మంచంపడతాడు. ఆయన జబ్బును నయం చేయడానికి మందులు తీసుకొని వచ్చేందుకు ఆరుగురు కుమారులు బయలుదేరతారు. సాహసకృత్యాలే ఊపిరిగా అడవిలో పెరిగిన శరాబందిరాజు తల్లితండ్రులను తిరిగి ప్రయత్నంలో రాజధానికి వచ్చి సవతి సోదరుల వల్ల అనేక అవమానాలను, హేళనలను ఎదుర్కొంటాడు. తనూ మందును వెతకటానికి బయలుదేరి కీలుగుఱ్ఱంలాంటి గుఱ్ఱాన్ని ఎక్కి ఏడు సముద్రాలు దాటి, శరాబందిరాజు, రత్నగంధి ([[శాంతకుమారి]]), యోజనగంధి ([[ఎమ్.వి.రాజమ్మ]]) ల సహాయంతో తండ్రి జబ్బును నయం చేసే మందును సంపాదిస్తాడు. అంతే కాకుండా తన సోదరులను రంగసాని ([[యస్.వరలక్ష్మి]]) చెర నుండి విడిపిస్తాడు.<ref name=":1">[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/mayalokam-1945/article3267384.ece MAYALOKAM (1945) - The Hindu April 1, 2012]</ref> మందు తెచ్చి తండ్రిని ఆరోగ్యవంతున్ని చేస్తాడు. సవతి తల్లులు, వారి పరివారం శరాబంది రాజుని గుర్తించి చంప ప్రయత్నిస్తారు. శరాబందిరాజు వారిని జయిస్తాడు.
 
== తారాగణం ==
ఈ సినిమాలో పాత్రధారులు, పాత్రలు:<ref name=":1">{{cite news |last1=ఎం.ఎల్. |first1=నరసింహం |title=MAYALOKAM (1945) |url=[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/mayalokam-1945/article3267384.ece |accessdate=17MAYALOKAM January(1945) 2019- |work=దThe హిందూHindu April |date=1 April, 2012 |language=en-IN}}]</ref>
* [[అక్కినేని నాగేశ్వరరావు]] - శరాబందిరాజు
* [[శాంతకుమారి]] - రత్నగంధి
"https://te.wikipedia.org/wiki/మాయలోకం" నుండి వెలికితీశారు