మొదలి నాగభూషణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51:
విషాదాంతం, జంట పక్షులు, సంభవామి, నరజాతి చరిత్ర, మన్మధుడు మళ్లీ పుట్టాడు, రాజా ఈడిపస్ (అనువాదం), [[ప్రజానాయకుడు ప్రకాశం]] మొదలైన నాటకాలను, అన్వేషణ, అడ్డదారి, ఆగస్టు 15, జననీ జన్మభూమి, రాజదండం మొదలైన నాటికలను రచించాడు. ఈయన దాదాపు 70 నాటకాలు, నాటికలు మరియు రేడియో నాటికలు వ్రాశారు. స్వతంత్ర నాటకాలే కాక అనేక అనువాద నాటకాలు కూడా వ్రాశాడు. ఈయన దర్శకత్వంలో ఇరవైకి పైగా ఆంగ్ల నాటకాలు, అరవైకి పైగా తెలుగు నాటకాలు ఈయన దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి.
 
తెలుగు సాహిత్యం- గాంధీజీ ప్రభావం, నూరేళ్ళ తెలుగునాటకరంగం (సంపాదకులు), లోచన (వ్యాస సంపుటి) వీరి ఇతర రచనలు. 'ప్రకాశం' నాటకానికి [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయం]] సాహిత్య పురస్కారం లభించింది. నాటక, కళారంగాల్లో విశేష కృషి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారానికి 2013 లో ఈయన ఎంపికయ్యాడు.<ref>http://archive.andhrabhoomi.net/content/s-1838</ref> 2019, జనవరి 6న [[తెనాలి]]లో [[అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్]] వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కారం అందుకున్నారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/మొదలి_నాగభూషణశర్మ" నుండి వెలికితీశారు