"నందమూరి తారక రామారావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
రామారావు [[1947]]లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన [[మద్రాసు]] సర్వీసు కమిషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు [[మంగళగిరి]]<nowiki/>లో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.
 
ప్రముఖ నిర్మాత [[బి.ఏ.సుబ్బారావు]] ఎన్టీఆర్ ఫొటోను [[ఎల్వీ ప్రసాదు]] దగ్గర చూసి, వెంటనే ఆయనను [[మద్రాసు]] పిలిపించి [[పల్లెటూరి పిల్ల]] సినిమాలో <!--ఎటువంటి పరీక్షలు లేకుండానే -->కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా [[మనదేశం]] అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా [[మనదేశం]] అయింది. [[1949]]లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. [[1950]]లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం [[ఎల్.వి.ప్రసాద్|ఎల్వీ ప్రసాదు]] [[షావుకారు]] కూడా విడుదలైంది. అల్లా [[నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం]] ప్రారంభమైంది. రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం [[చెన్నై|మద్రాసు]]<nowiki/>కు మార్చివేశాడు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.<!--ఆ సమయంలో రామారావు డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి బస్సు చార్జీలకు కూడా డబ్బుండేది కాదు.-->
 
<nowiki/><!--ఆ సమయంలో రామారావు డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి బస్సు చార్జీలకు కూడా డబ్బుండేది కాదు.-->
 
[[1951]]లో కె.వి.రెడ్డి [[పాతాళభైరవి]], దాని తరువాత అదే సంవత్సరం [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్‌.రెడ్డి]] [[మల్లీశ్వరి]], [[1952]]లో ఎల్వీ ప్రసాదు [[పెళ్ళిచేసి చూడు]], ఆ తరువాత వచ్చిన [[కమలాకర కామేశ్వరరావు]] చిత్రం [[చంద్రహారం]] ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. [[పాతాళభైరవి]] 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది స్ఫురద్రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2545614" నుండి వెలికితీశారు