నిర్మలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==నటనా జీవితం==
నిర్మలమ్మ అసలు పేరు '''రాజమణి'''. స్వస్థలం [[కృష్ణా జిల్లా]] [[బందరు]]. చిన్ననాటినుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఆదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1943లో తన పదహారేళ్ల వయసులో [[గరుడ గర్వభంగం]] సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు. తనకన్నా పెద్దవారైన నాటి [[నందమూరి తారక రామారావు|ఎన్.టీ రామారావు‌]], [[అక్కినేని నాగేశ్వరారవు]], [[యస్వీఆర్యస్వీ రంగారావు]] ల నుంచి నేటి [[చిరంజీవి]], [[బాలకృష్ణ]], [[వెంకటేష్]] వరకు ఎందరో హీరోలకు [[బామ్మ]]<nowiki/>గా, [[అమ్మ]]<nowiki/>గా నటించారు. [[మయూరి]], [[సీతారామరాజు]] సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు.
 
[[శంకరాభరణం]], [[యమగోల]], [[పదహారేళ్ల వయసు]], [[మావిచిగురు]], [[గ్యాంగ్ లీడర్]], [[శుభసంకల్పం]], [[ఆపద్బాంధవుడు]], [[స్వాతిముత్యం]] తదితర చిత్రాల్లో వయసు మీద పడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. [[స్నేహం కోసం]] చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. [[ఎస్వీ కృష్ణారెడ్డి]] బలవంతం మీద ఆమెను చివరి చిత్రం [[ప్రేమకు ఆహ్వానం]]లో నటించడానికి ఒప్పించాడు.
"https://te.wikipedia.org/wiki/నిర్మలమ్మ" నుండి వెలికితీశారు