ఎం. ఎస్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
వీరిది కులాంతర ప్రేమ వివాహము. భార్య కళాప్రపూర్ణ, కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగులు వేశారు. మొదటగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎమ్మెస్ నటించిన తొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ. వీరి కుమారుడు విక్రం [[కొడుకు]] చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
 
సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా రెండు మూడు రోజులు ఖాళీ సమయం దొరికితే వెంటనే నిడమర్రులో వాలిపోయేవారు.తన స్నేహితులు, సోదరులతో కలిసి గ్రామంలో సామాన్యుడిగా తిరిగేవారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ గ్రామ నాయకులతో ఎపుడూ చెపుతుండేవారు. నిడమర్రు అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తానని అంటుండేవారు.అంతలోనే 2015 లో జిల్లాలో సంక్రాంతి పండుగకు హాజరై ఇక అస్వస్థతకు గురై తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.
 
== నాటకాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎస్._నారాయణ" నుండి వెలికితీశారు