మంచి మిత్రులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
గోపి (కృష్ణ), శ్రీను (శోభన్‌బాబు) స్నేహితులు. ఒకే రూములో కలిసి జీవిస్తుంటారు. గోపికి ఆవేశం ఎక్కువ. శ్రీను సమయానుకూలంగా సర్దుకుపోతుంటాడు. ఒకనాడు ఆఫీసర్‌తో వచ్చిన చిన్న తగాదా కారణంగా గోపి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఈ సంఘటన గోపి, శ్రీను మధ్య మాట పట్టింపునకు కారణమవుతుంది. దీంతో ఐదేళ్లపాటు ఇరువురూ విడివిడిగా జీవించి, ఆ తరువాత కలుసుకుందామని నిర్ణయించుకుంటారు. పట్నం చేరిన గోపి ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలుడవుతాడు. మంచికి పోగా చెడు ఎదురవటంతో అనుకోకుండా ఓ నేరంలో చిక్కుకోబోవటం, దాన్నించి తనను రక్షించిన గజదొంగ పశుపతి (నాగభూషణం)ని విడిపించే ప్రయత్నంలో తానే పెద్ద నేరస్తుడిగా, గజదొంగ గంగారాంగా మారడం జరుగుతుంది. పశుపతి చెల్లెలు మీనా (గీతాంజలి) గంగారాంను ఇష్టపడుతుంది. వేరే వూరుచేరిన శ్రీను అనుకోకుండా గోపి తల్లిని, చెల్లెలు ఇందిర (విజయనిర్మల)ను కలుసుకుంటాడు. వాళ్లింట అవుట్‌హౌవుస్‌లో ఉంటున్న మాలోకం (చలం) గదిలో ఆశ్రయం పొందుతాడు. అలా ఇందిర ప్రేమను, ఇన్‌స్పెక్టరుగా ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. గంగారాంను అరెస్ట్ చేయటానికి స్పెషల్ డ్యూటీమీద శ్రీను హైద్రాబాదు వస్తాడు. అయితే, తల్లి మరణించటంతో ఇందిర కూడా హైద్రాబాదులోని గంగారాం వద్దకు చేరుకుంటుంది. గంగారాం ప్రయత్నాలను శ్రీనివాస్‌గా విఫలం చేస్తుంటాడు. ఆక్రమంలో ఐదేళ్ల అనంతరం తమ సంకేత స్థలంలో కలుసుకున్నపుడు, ఎవరెవరో నిజం తెలిసికోవటం జరుగుతుంది. తరువాత గంగారాంను బంధించాలని శ్రీనివాస్, శ్రీనివాస్‌ను అంతం చేయాలని గంగారాం.. ఇద్దరూ బుల్లెట్ లేని తుపాకీలతో రావటం, మరో పోలీసు కాల్చిన తూటాతో గంగారాం గాయపడగా, మిత్రులిద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని దుఃఖించటం, గంగారాం మరణించటంతో చిత్రం ముగుస్తుంది.
==పాటలు==
# ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే- ఇన్నినాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే - [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]], [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్.పి. బాలుబాలసుబ్రహ్మణ్యం]] - రచన: డా॥ [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సినారె]]
# ఎంతో వున్నది అంతు తెలియనిది తెలియాలంటే కలుసుకొమ్మన్నది - [[పి.సుశీల]]
# ఓరచూపులు చూడకముందే ఒళ్ళు ఎందుకే ఝల్లుమనే చేతితో - ఎస్.పి. బాలుబాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల రచన:[[ఆరుద్ర]]
# నాలుగువైపులు గిరిగీసి ఆపై సన్నని తెరవేసి ఎదురు ఎదురుగా - పి.సుశీల, ఎస్.పి.బాలుబాలసుబ్రహ్మణ్యం బృందం
# అరె నిషా నిషా మజామజా నీకు కావాలా - పి.సుశీల
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మంచి_మిత్రులు" నుండి వెలికితీశారు