నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== తొలి అవకాశాలు ==
1945-47లో రామారావు గుంటూరులో బి.ఏ. చదివేవాడు. పలుమార్లు ఫెయిలై ఎఫ్.ఏ. పూర్తిచేయడంతో ఊళ్ళో జనం అపహాస్యం చేయడంతో ఎలాగైనా పట్టుదలతో డిగ్రీ పూర్తిచేయాలని పూనుకున్న రామారావు ఆ దశలో వచ్చిన సినిమా అవకాశాలను తిరస్కరించాడు. [[ఎల్.వి.ప్రసాద్]] అదే సమయంలో తాను తీస్తున్న "శ్రీమతి" సినిమాలో హీరో వేషం కోసం స్క్రీన్‌టెస్ట్ చేసి ఎంపిక చేశారు. ఐతే ఎన్నాళ్ళకూ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో ఎల్వీ ప్రసాద్ మన దేశం అన్న సినిమా మొదలుపెట్టారు. అందులో ఓ చిన్న వేషం ఆఫర్ చేస్తే ఈసారి హీరో కాదని రామారావు తిరస్కరించాడు. నేషనల్ ఆర్ట్ థియేటర్ అన్న సంస్థ ఏర్పరిచి నాటకాలు ఆడుతూ, ఓ పరీక్ష పాసై సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించి, అక్కడి అవినీతిమయం అయిన వాతావరణం నచ్చక 11 రోజుల్లో వదిలేశాడు. మరో వైపు ఎల్వీ ప్రసాద్ సూచన మేరకు మరో దర్శకుడు బి.ఏ.సుబ్బారావు తాను తీస్తున్న పల్లెటూరు పిల్ల సినిమాలో హీరో పాత్రకి పరిశీలిస్తామని, మద్రాసు రమ్మని రామారావుకు ఉత్తరం రాశాడు. రామారావు రూపం, గొంతు చూసి మేకప్ టెస్ట్ కూడా లేకుండా సుబ్బారావు హీరో పాత్రకు ఎంపిక చేశాడు.<ref>{{Cite web|url=https://telugu.greatandhra.com/articles/mbs/ntr-anecdotes-02-95867.html|title=ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 02|website=గ్రేటాంధ్ర|firstfirst1=ఎమ్బీయస్|last2last1=ప్రసాద్}}</ref>
 
== 1959-1960 ==