ఎడ్యుకేషనల్ ప్లానింగ్ చట్టం, మీడియం-టర్మ్ యాక్షన్ స్ట్రాటజీ ఫలితంగా విద్యా రంగం అంతటా గణనీయమైన పురోగతి నమోదు చేయబడింది.<ref name="infodev.org"/> ప్రధానంగా పాఠశాల నమోదు, హాజరు నిలుపుదల శాతం కొంత ప్రాంతీయ వైవిధ్యంతో క్రమంగా అధికరించింది. 2004 నుండి 2005 నుండి 2007-08 వరకు ప్రాధమిక పాఠశాలలో బాలికలు నికర నమోదు 18.6% పెరిగింది; బాలురలో 8.0% పెరిగింది. ఇదే కాలంలో మాధ్యమిక పాఠశాలల నికర నమోదులు 72.4% అధికరించాయి. బాలురలో 52.2% అధికరించింది. సెకండరీ స్థాయిలో నమోదుల శాతం బాలికలలో 49.8%, బాలురలో 56.1% అధికరించింది.<ref name="Datee">[http://eastafrica.usaid.gov/documents/document/document/1368 Djibouti Assistance to Education Evaluation] {{webarchive|url=https://web.archive.org/web/20121112235926/http://eastafrica.usaid.gov/documents/document/document/1368 |date=12 November 2012 }}. USAID (April 2009)</ref>