"మల్లీశ్వరి" కూర్పుల మధ్య తేడాలు

శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్.రెడ్డి రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు. ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా 'వందేమాతరం' షూటింగు కోసం [[హంపి]] వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే ఉన్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, [[బుచ్చిబాబు]] వ్రాసిన రాయలకరుణకృత్యం నాటిక కలిపి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] చేత "మల్లీశ్వరి" స్క్రిప్టుగా అభివృద్ధి చేశారు. అయితే బుచ్చిబాబు పేరు కథారచయితగా సినిమాలో క్రెడిట్ ఇవ్వలేదు.<ref name="బుచ్చిబాబు గురించి గొల్లపూడి">{{cite news|last1=గొల్లపూడి|first1=మారుతీరావు|title='బుచ్చిబాబు' చిరంజీవి|url=http://www.sakshi.com/news/editorial/writer-buchi-babu-lives-forever-247555|accessdate=11 June 2015|work=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|date=11 జూన్ 2015}}</ref>
 
బి.ఎన్.రెడ్డి ఈ సినిమా స్క్రిప్టును కృష్ణశాస్త్రితో కూర్చుని చాలా శ్రద్ధగా అభివృద్ధి చేయించుకున్నాడు. సినిమాలో మల్లీశ్వరి నాగరాజు ముందు ప్రదర్శించిన నృత్య గానాలను మారువేషంలో చూసిన అల్లసాని పెద్దన ఆశువుగా ఆమెను మెచ్చుకుంటూ ఓ పద్యం చెప్పే సన్నివేశం ఉంది. అల్లసాని పెద్దన రాసినట్లుగా అల్లిక జిగిబిగితో రావాలన్న జాగ్రత్త వల్ల కృష్ణశాస్త్రితో 108 పద్యాలు రాయించుకుని అందులో ఒక్కటి ఎంపిక చేసుకున్నాడు బి.ఎన్.రెడ్డి.<ref>{{Cite book|title=కళాత్మక దర్శకుడు బి.యెన్.రెడ్డి|last=దక్షిణామూర్తి|first=పాటిబండ్ల|publisher=|year=|isbn=|location=|pages=}}</ref><ref name=":0">{{Cite book|title=తెలుగు సినిమా స్వర్ణయుగం|last=రమణారెడ్డి|first=ఎం.వి.|publisher=ఎం.వి.రమణారెడ్డి|year=2004|isbn=|location=|pages=2125|url=http://www.sathyakam.com/pdfbook.php?bId=331}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
 
 
== స్పందన ==
మల్లీశ్వరి సినిమా మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుని, విమర్శకుల ప్రశంసలు సాధించింది. మల్లీశ్వరి తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో స్వర్ణయుగానికి చెందిన గొప్ప సినిమాగా ప్రాచుర్యం పొందింది. ప్రేక్షకులు, అభిమానులు దీన్ని బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మేటి సినిమాగా ఎంచారు. ఈ సినిమా రచన చేసినందుకు దేవులపల్లి కృష్ణశాస్త్రికి మద్రాసు (నేటి చెన్నై) [[పచ్చయ్యప్ప కళాశాల]] అధ్యాపక బృందం సన్మానించగా కృష్ణశాస్త్రి ఆ సందర్భంగా "వాస్తవంగా దీనికి అర్హుడైన వ్యక్తిని నేను కాదు. మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాతృలం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం" అన్నాడు.<ref name=":0" />
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2564640" నుండి వెలికితీశారు