మల్లీశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

#1Lib1Ref
#1Lib1Ref
పంక్తి 49:
 
=== చిత్రీకరణ ===
చిత్రీకరణ విషయంలోనూ దర్శకుడు బి.ఎన్.రెడ్డి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఉదాహరణకు సినిమాలో నాటకాన్ని చూడడానికి రాణి, రాజు వేర్వేరుగా బయలుదేరేప్పుడు రాణి బయలుదేరే వైభవాన్నే చూపించి, రాజుది తెరపై చూపకుండా వదిలేశాడు. దేనికంటే బి.ఎన్.రెడ్డి - "రాణిగారి వైభవం చూసి రాజుగారిది మరెంత గొప్పగా ఉంటుందోనని ప్రేక్షకులు ఊహించుకోవడానికి వదిలేయాలి. ఎంతో గొప్పగా ఊహించుకునే రాయలవారి వైభవాన్ని సంతృప్తికరంగా చిత్రీకరించడం కష్టం" అని వివరించాడు. ఇలా చిత్రీకరించిన సన్నివేశాలను, చిత్రీకరించకుండా వదిలివేసినవి కూడా జాగ్రత్తగా ఎంచుకుని చేశాడు.<ref>{{Cite book|title=తెలుగు సినిమా స్వర్ణయుగం|last=రమణారెడ్డి|first=ఎం.వి.|publisher=ఎం.వి.రమణారెడ్డి|year=2004|isbn=|location=|page=28|url=http://www.sathyakam.com/pdfbook.php?bId=331}}</ref> ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే పటేల్ మరణిస్తే అతని అభిమాని, అతనితో కొంత స్నేహం కలిగిన బి.ఎన్.రెడ్డి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అసిస్టెంట్లకు వదిలివెళ్ళాడు. వచ్చి చూసుకునేసరికి మహారాణి తిరుమలదేవి పాత్రధారిణి మహారాణికి తగినట్టు కొంగు వెనుక విడిచి నడవకుండా, కుడిచేత్తో పట్టుకుని సామాన్యురాలిగా నడిచినట్టు కనిపించింది బి.ఎన్.రెడ్డికి. దాంతో ఆ దృశ్యం తిరిగి చిత్రిస్తానని పట్టుబట్టగా, భాగస్వాములు ఆ కాస్త షాట్ల కోసం తిరిగి సెట్ వేసి చిత్రీకరించడం ఆర్థికంగా భారమని వివరించి ఎలాగో ఒప్పించారు.<ref>{{Cite namebook|title=":0"తెలుగు సినిమా స్వర్ణయుగం|last=రమణారెడ్డి|first=ఎం.వి.|publisher=ఎం.వి.రమణారెడ్డి|year=2004|isbn=|location=|page=29|url=http:/>/www.sathyakam.com/pdfbook.php?bId=331}}<br /ref>
==పాటలు==
ఈ చిత్రంలో పాటలు అన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. ఒక సంప్రదాయ గానం, మరొక పురందరదాసు కీర్తన (గణేశ ప్రార్థన) తప్పించి మిగిలినవన్నీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రచనలే. స్త్రీలను ఆకర్షించేందుకు భక్తి పాటలను ఏదో విధంగా చొప్పించే రోజుల్లో ఈ సినిమాలో టైటిల్స్‌ శ్రీగణనాథం అనే పిళ్ళారి గీతం తప్ప మిగతా పాటలన్నీ సినిమాకు ముఖ్య కథాంశమైన అనురాగం, ప్రణయం, రెండవ థీం అయిన విజయనగర వైభవం చుట్టూ ఉండేలా రూపొందించారు.<ref name=":0" /> మొత్తం పాటల స్వరకల్పనకు ఆరు నెలల కాలం పట్టింది. రాజేశ్వర రావు ఎన్నో రిహార్సల్స్ నిర్వహించారు. [[అద్దేపల్లి రామారావు]] ఆర్కెస్ట్రా నిర్వహించాడు.
"https://te.wikipedia.org/wiki/మల్లీశ్వరి" నుండి వెలికితీశారు