గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎గ్రామ రెవిన్యూ అధికారి: ఈ విభాగంలోని సమాచారం గ్రామ రెవెన్యూ అదికారి వ్యాసానికి తరలించాను
పంక్తి 357:
* సంబంధిత చట్టం ప్రకారం వివాహాలకు సంబంధించిన విధులను నిర్వహించాలి. వివాహాలను రిజిష్టర్లలో నమోదు చేయాలి. బాల్య వివాహాలు జరగకుండా చూడాలి. అట్లా జరిగితే పోలీసు రిపోర్టు ఇవ్వాలి.
* లబ్ధిదారులను గుర్తించడంలోనూ, రుణాల పంపిణీ మరియు వసూళ్లలోనూ గ్రామసభకు సహాయపడాలి.
 
== '''గ్రామ రెవిన్యూ అధికారి''' ==
 
పూర్వం ఆంధ్రప్రాంతంలో కరణం మునసబు మరియు తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. 1985 లో ఈ విధానాన్ని తొలగించి గ్రామ సహయకులను నియమించారు. తరువాత 1990 లో గ్రామ పాలనాధికారి (వి.ఏ.వో ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. తరువాత 2002 లో మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేసే పంచాయితీ సెక్రటరీల విధానం అమలులోకి వచ్చింది. పంచాయితీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి గ్రామ రెవిన్యూ అధికారుల (Village Revenue Officer) వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది. వీరు [[తహసీల్దారు]] (ఎంఆర్ఒ) అజమాయిషీలో పని చేస్తారు.
 
'''అధికారుల కేటాయింపు మరియు నియమించు విధానము:''' 2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం 28,123 గ్రామాలు న్నాయి. అందులో 26,613 నివాసిత గ్రామాలు 1,510 నివాసాలు లేని గ్రామాలు. . కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 21,809 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక [[గ్రామ రెవిన్యూ అధికారి]] వుండాలి. పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ లో 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి వీ.ఆర్.వో లు ఉంటారు. ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది. [[గ్రామ రెవిన్యూ అధికారి]]కి సహాయకునిగా గ్రామంలోనివసించే వారిలో ఒకరిని గ్రామ రెవిన్యూసహాయకునిగా నియమించుతారు.
 
'''గ్రామ రెవెన్యూ అధికారి విధులు:''' గ్రామ ఆదాయ ఆధికారి విధులు జి.ఒ.ఎమ్.ఎస్ సంఖ్య 1059 రెవిన్యూ( గ్రామ పరిపాలన)శాఖ 31.7.2007 లో పేర్కొన్నారు. దీని ప్రకారం సాధారణ పరిపాలన రెవిన్యూ విధులు, పోలీస్ విధులు మరియు సామాజిక సంక్షేమం అభివృద్ధి వున్నాయి. సాధారణ పరిపాలన మరియు రెవిన్యూ విధులు, గ్రామ లెక్కలు నిర్వహించడం.
 
== '''గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులు''' ==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు