బర్డ్ ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: == బర్డ్ ఫ్లూ వ్యాది == బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ ఫ్లూయంజా అని ఆంగ్ల...
 
పంక్తి 1:
== బర్డ్ ఫ్లూ వ్యాది ==
తే.దీ.29 జనవరి 2008
బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ ఫ్లూయంజా అని ఆంగ్లము లో వ్యవహరిస్తారు. ఈవ్యాధి కోళ్లు,బాతులు,ఇతర పక్షిజాతులకు ఒక దాని నుంచి ఒకదానికి త్వరైతంగా వ్యాపిస్తుంది. ఎహ్5ఎన్1 అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. కోళ్లలో వ్యాపించిన ఈవ్యాది 2 రకాల వ్యాది లక్షనాలు ప్రదఎషించవచ్చు.1.ఈ వైరస్ కొద్ది స్థాయిలో సోకినపుడు కోళ్ల ఈకలు చెల్లా చెదురైనట్లు కనిపిస్తాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది . 2.ఈ వైరస్ తీవ్రముగా సోకినపుడు కోడి వివిద శరీర అవయవాలు దెబ్బతిని 48 గంటలలో చనిపోతుంది.కోళ్లు జారవిడిచే సొంగ ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరొక కోడికి త్వరితముగా వ్యాపిస్తుంది.అలాగే కోడి రెట్టలద్వారా కూడా ఈవ్యాధి వ్యాపిస్తుంది.చాలా అడవి పక్షులలో ఈవ్యాధి క్రిములు పేగులలో ఉండవచ్చును.కాని దీప్రభావము వెంటనే కనిపించదు.ఈ పేగులు ఈ వైరస్ కి రిజర్వాయర్ గా ఉంటాయి. ఈ పేగులే ఇతర పక్షిజాతులకు ఈ వ్యాధి సోకడానికి వాహకాలుగా పనిచేస్తాయి.మనుషులకు సోకే ఫ్లూ వ్యాధి కూడా ఈ రకానికి చెందినదే. మనుషులకు సోకే వైరస్ లకు, కోళ్లకు సోకే వైరస్ లకు కొన్ని తేడాలు ఉన్నాయి.మనుషులకు ఎహ్1ఎన్1, ఎహ్1ఎన్2,ఎహ్3ఎన్2 వైరస్ లు సోకుతాయి.కోళ్లకు ఎహ్5ఎన్1 వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్తితులలో మాత్రమే మనుషులకు సోకుతుంది.అయితే ఈవైరస్ లు త్వరితముగా రూపాంతరము చెందే శక్తి కలిగి ఉంటాయి.అందువలన మానవ జాతికి మొదట నుండీ ఈ వైరస్ అంటే భయమే.1918 లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా సోకినపుడు ప్రపంచవ్యాప్తముగా 4కోట్లు మంది మరణించారు.బర్ద్ ఫ్లూ కూడా అదేవిదముగా రూపాంతరము చెంది మానువులకు హానికలిగింస్తుందేమోనని శాస్త్రవేత్తలు నిరంతరము నిఘాతో ఉంటున్నారు.అదే జరిగితే మానవ జాతిలో 25 - 30 శాతము ప్రజలకు దీని ప్రభావము పడుతుందని భయాందోళనలు వ్యక్త మవుతున్నాయి. మానవ జాతిపై ప్రభావము గురించి అలా ఉంచి పక్షులకు ఈ వ్యాధి సోకడము వల్ల అపారమైన ఆర్ధిక నస్టము జరుగుతుంది . ఈ వ్యాధి వ్యాపించ కుండా కోట్లాది కోళ్లను వధించాల్సివస్తుంది.
"https://te.wikipedia.org/wiki/బర్డ్_ఫ్లూ" నుండి వెలికితీశారు