→‎Invitation to Organize Wiki Loves Love 2019: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
→‎ముసునూరి నాయకులు: కొత్త విభాగం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 186:
</div>
<!-- Message sent by User:Tiven2240@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/Wiki_Loves_Love&oldid=18760999 -->
 
== ముసునూరి నాయకులు ==
 
నమస్కారం పవన్ సంతోష్ గారు. "ముసునూరి నాయకులు" వికీ పేజీ విషయంలో నేను మీతో చర్చించ దలుచుకున్నాను. ముసునూరి నాయకులు పేజీని మీరు నిరవధికంగా సంరక్షించారు అని అర్థం అయింది. ఆ పేజీని ఎడిట్ చెయ్యటానికి సాధ్యపడట్లేదు. కాని అందులో ఎన్నో తప్పులు ఉన్నవి. ప్రముఖ చరిత్రకారుల పుస్తకాల ప్రకారం....
1. వారి రాజ్యం చివరి కాకతీయ ప్రతాపరుద్రుని మరణం తరువాత అనగా క్రీ. శ. 1325 కాలంలో ఏర్పడింది. కానీ పేజీలో ఎంతో ముందు సమయాన్ని సరయిన ఆధారాలు లేకుండా చేర్చటం జరిగింది.
 
2. రాజుల అసలు పేర్లు ముసునూరి ప్రోలానీడు, ముసునూరి కాపానీడు. కానీ అందులో నాయుడు అనే బిరుదులను చేర్చటం జరిగింది ఆధారాలు లేకుండా.
 
3. ఈ వంశంలో పాలించింది కేవలం ముగ్గురు రాజులే. ముసునూరి ప్రోలానీడు, ముసునూరి కాపానీడు, ముసునూరి వినాయకదేవుడు. కానీ పేజీలో అనేక మంది రాజుల పేర్లను ఇవ్వడం జరిగింది ఆధారాలు లేకుండా.
 
4. మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి ప్రసిద్ద చరిత్రకారులుతో సహా అనేక మంది చరిత్రకారులు ఈ వంశీకుల పాలనాకాలం క్రీ. శ. (1325-1368) అని ఇవ్వడం జరిగింది.
 
5. ఈ వంశీకుల రాజధానులు రేఖపల్లి, ఓరుగల్లు, రాజమండ్రి అని చరిత్రకారులు తెలిపారు.
 
ఈ విషయాలను కొద్దిగా గమనించవలసిందిగా నా విన్నపం. [[వాడుకరి:Lillinan1|Lillinan1]] ([[వాడుకరి చర్చ:Lillinan1|చర్చ]]) 13:40, 3 ఫిబ్రవరి 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Pavan_santhosh.s" నుండి వెలికితీశారు