ఆలంపూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 192:
 
==ఆలంపూర్ పురావస్తు ప్రదర్శనశాల==
[[దస్త్రం:ARCHAEOLOGICAL MEUSEUM, ALAMPUR.JPG|thumb|right|300px|పురావస్తు ప్రదర్శనశాల,ఆలంపూర్ ]]
ఆలంపూర్ జోగుళాంబ దేవాలయ సమీపంలో [[పురావస్తు ప్రదర్శనశాల]] ఉంది. దీనిని [[1952]]లో ఏర్పాటుచేశారు. ఇందులో క్రీ.శ.6 వ శతాబ్దము నుంచి క్రీ.శ.12వ శతాబ్దము వరకు కాలానికి సంబంధించిన పురాతన, చారిత్రక శిల్పాలు భద్రపర్చబడ్డాయి. ఉదయం గం.10.30 నుంచి సాయంత్రం గం.5.00 వరకు దీనిని సందర్శకులకై తెరిచి ఉంచుతారు. దేవాలయానికి వచ్చే యాత్రికులు దీనిని కూడా సందర్శిస్తారు.
 
== రక్షణ గోడ ==
అలంపూర్ పట్టణానికి చుట్టూ అన్ని వైపులా రక్షణ గోడ ఉంది. నిజానికి [[శ్రీశైలం]] ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో అలంపూర్ కూడా ఒకటి. కాని ముంపుకు గురై పట్టణాన్ని వేరేచోట నిర్మిస్తే, పట్టణంలోని ఆలయాలు పాడై, పునర్నిర్మాణ అసాధ్యమై, వాటి ప్రాభవాన్ని కోల్పోతాయని భావించి, అది ఊరికి అరిష్టంగా తలచి, అప్పటి ఆలయ ధర్మకర్త, ప్రముఖ కవి, చారిత్రక పరిశోధకులు [[గడియారం రామకృష్ణ శర్మ]] గారు ఊరి పెద్దలను ఒప్పించి, గ్రామ పున నిర్మాణానికి దక్కే నష్టపరిహారపు సొమ్మును వినియోగించి పట్టణం చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటుచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి, నిర్మించారు. ఈ రక్షణ వలయం ఊరి చుట్టూ ఉన్నప్పటికి పశ్చిమం వైపు ఎత్తు తక్కువగానూ, తూర్పు వైపు నది ఉండటం వలన అత్యంత ఎత్తులోనూ ఉండి, కోటగోడను తలపిస్తుంది, వర్షా కాలంలో నది జోరుగా ప్రవహించినా ఈ నిర్మాణం వలన నీరు పట్టణంలోకి రాదు. పట్టణంలోని మురికి నీరంతా ఊరి మధ్యలోని జోగులాంబ వాగులోకి చేరుతుంది. ఈ నీరు [[తుంగభద్ర]] వైపు వెలుతుంది. అయితే రక్షణ గోడ అడ్డు ఉండటం వలన నీటిని మోటారులతో ఎత్తి నదిలోకి చేరుస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/ఆలంపూర్" నుండి వెలికితీశారు