సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 37:
 
== జాతీయ నేతగా ==
[[Https://en.wikipedia.org/wiki/Barrister|బారిష్టరు]] పట్టా పుచ్చుకొని [[ఇంగ్లాండు]] నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జరుగుతున్న [[భారత జాతీయోద్యమం]] ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. [[1928]]లో [[బార్డోలీ]]లో [[బ్రిటీష్ ఇండియా]] ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి [[సర్దార్]] అనే పేరు వచ్చింది.
[[Image:Gandhi, Patel and Maulana Azad Sept 1940.jpg|thumb|1940, బాంబే, ఏ.ఐ.సి.సి. మీటింగులో గాంధీ, మౌలానా ఆజాద్ లతో పటేల్.]]
గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల [[విరాళాలు]] సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. [[గుజరాత్‌]]లో [[మద్యపానం]], [[అస్పృశ్యత]], కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేసారు.