జనవరి 2008: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వార్తలు జతచేశాను
పంక్తి 10:
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''జనవరి 30, 2008'''
* [[మహాత్మా గాంధీ]] 60 వ వర్థంతి సందర్భంగా దేశమంతటా జాతిపితకు ఘననివాళులు అర్పించారు.
* [[త్రిపుర]]లో శాసనసభ ఎన్నికలకై అధికారికంగా [[ఎన్నికల కమీషన్]] నోటిఫికేషన్ జారీచేసింది.
* [[శ్రీలంక]]లో [[ఎల్.టి.టి.ఇ]] కి చెందిన 50కి పైగా తీవ్రవాదులు తమ దాడుల్లో చనిపోయినట్లు శ్రీలంక సైన్యం ప్రకటన.
:'''జనవరి 29, 2008'''
* 15 వ సార్క్ సదస్సుకు [[శ్రీలంక]] లోని [[కాండీ]] నగరంలో [[2008]] [[జూలై]], [[ఆగస్టు]]లో నిర్వహించబడుతుందని శ్రీలంక ప్రభుత్వం ప్రకటన.
* [[భారతీయ జనతా పార్టీ]]ని బలొపేతం చేయడానికి ఆ పార్టీ ప్రముఖ నేత [[లాల్ కృష్ణ అద్వానీ]] సంకల్ప్‌యాత్ర చేపట్టాలని నిర్ణయం. [[ఫిబ్రవరి 6]] నుంచి [[మార్చి 23]] వరకు ఈ యాత్ర జరుగనుంది.
* [[ప్రజాస్వామ్యం]] గురించి [[పాకిస్తాన్]] భారత్‌నుంచి నేర్చుకోవాల్సి ఉందని పాకిస్తాన్ ప్రతిపక్షనేత మాజీ [[క్రికెట్]] కెప్టెన్, ''తెహ్రిక్ ఈ ఇన్సాఫ్'' పార్టీ అధినేత [[ఇమ్రాన్ ఖాన్]] ప్రకటన్.
* ఆగ్నేయాసియా దేశమైన [[థాయ్‌లాండ్]] కొత్త ప్రధానమంత్రిగా [[సమక్ సుందరవేజ్]] ఎన్నికయ్యారు.
* [[భారతదేశం|భారత్]] కు చెందిన బౌలర్ [[హర్భజన్ సింగ్]]పై విధించిన మూడు మ్యాచ్‌ల నిషేధాన్ని ఐసీసీ తొలగించింది. నిషేధం స్థానంలో మ్యాచ్ ఫీజులో 50% కోత విధించింది.
* ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు రెండో స్థానం లభించింది.
* [[ఆసియా]] నెంబర్ వన్ మహిళా [[టెన్నిస్]] క్రీడాకారిణిగా [[భారతదేశం|భారత్]] కు చెందిన [[సానియామీర్జా]] అవతరించినది.
:'''జనవరి 28, 2008'''
* [[భారతదేశం|భారత్]] - [[ఆస్ట్రేలియా]]ల మధ్య జరిగిన [[అడిలైడ్]] టెస్ట్ డ్రా. 4 టెస్టుల సీరీస్ 2-1 ఆధిక్యంతో ఆస్ట్రేలియా కైవసం. సీరీస్‌లో 24 వికెట్లు సాధించిన [[బ్రెట్‌లీ]] మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌గా ఎన్నికయ్యాడు.
* భారత తపాలాశాఖ చే ఇన్‌స్టంట్ [[మనియార్డర్]] విధానం ప్రారంభం. రూ.50 వేల లోపు డబ్బును తక్షణమే ఖాతాదారుడికి చేర్చడానికి ఈ విధానం తోడ్పడుతుంది.
:'''జనవరి 27, 2008'''
* [[ఇండోనేషియా]]మాజీ అధ్యక్షుడు జనరల్ [[సుహార్తో]] మృతి. ఇతడు [[1998]] వరకు 32 సంవత్సరాలు దేశాన్ని పాలించాడు.
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌]] పురుషుల టైటిల్‌ను మూడో సీడెడ్ క్రీడాకారుడైన [[సెర్బియా]]కు చెందిన [[నోవాక్ జకోవిచ్]] కైవసం. [[మెల్‌బోర్న్‌]]లో జరిగిన ఫైనల్లో అన్‌సీడెద్ క్రీడాకారుడైన [[ఫ్రాన్స్‌]]కు చెందిన [[జోవిల్ ఫ్రైడ్ సోంగా]]పై 4-6, 6-4, 6-3, 7-6 తేడాతో విజయం సాధించాడు. జకోవిచ్ గ్రాండ్‌స్లాం టైటిల్ గెలిచిన తొలి సెర్బియన్‌గా రికార్డు సృష్టించాడు.
* ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ ఫైనల్లో [[భారతదేశం|భారత్‌]]కు చెందిన [[మహేష్ భూపతి]] - [[సానియా మీర్జా]] జంట పరాజయం. ఫైనల్లో నెనాద్ జిమోంజిక్ (సెర్బియా)-తియాతియాన్ ([[చైనా]]) జంట 7-6, 6-4 స్కోరుతో విజయం.
:'''జనవరి 26, 2008'''
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌]] మహిళల టైటిల్ [[రష్యా]]కు చెందిన [[మరియా షరపోవా]] కైవసం. [[మెల్‌బోర్న్‌]]లో జరిగిన ఫైనల్లో [[ఇవనోవిక్]] పై 7-5, 6-3 స్కోరుతో ఓడించి 12 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ సాధించింది. షరపోవాకు ఇది మూడవ గ్రాండ్‌స్లాం టైటిల్.
"https://te.wikipedia.org/wiki/జనవరి_2008" నుండి వెలికితీశారు