వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
నిర్వాహకత్వ విధులను స్వీకరించే సమయంలో వాడుకరులు తమ శాయశక్తులా కృషి చేసే ఉత్సాహంతోటే ఉంటారు. అయితే తదనంతర కాలంలో వివిధ కారణాల రీత్యా నిర్వాహకత్వ బాధ్యతలను నిర్వర్తించడంలో కొందరు నిర్వాహకుల్లో చురుకుదనం లోపించవచ్చు. అది వికీపీడియాకు ప్రగతి నిరోధకము, వికీపీడియా నాణ్యత తగ్గేందుకు కారణమూ కావచ్చు. దీన్ని గ్రహించిన సదరు నిర్వాహకులు వికీపీడియా బాగోగులను దృష్టిలో ఉంచుకొని తామే స్వచ్ఛందంగా నిర్వాహకత్వ బాధ్యతల నుండి తప్పుకోవచ్చు. అలా నిర్వాహకులు స్వచ్ఛందంగా తప్పుకొనేందుకు, అలా గ్రహించనిచెయ్యని నిర్వాహకులను సముదాయమే తప్పించేందుకూ ఒక విధానం ఉండాలి.
 
నిర్వాహకత్వ బాధ్యతలను నిర్వర్తించడంలో చురుగ్గాలేని వాడుకరులు తమ నిర్వాహకత్వాన్ని స్వచ్ఛందంగా ఉపసంహరించుకునేందుకు కోరవచ్చు. లేదా వారిని నిర్వాహకత్వ బాధ్యతల నుండి తప్పించేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. పై సందర్భాల్లో సదరు నిర్వాహకులను [[m:stewards|స్టీవార్డులు]] ఈ బాధ్యతల నుండి తప్పిస్తారు. కొన్ని వికీపీడియాల్లో నిర్వాహకుల పనులను సమీక్షించి నిర్ణయం తీసుకునేందుకు {{Ill|వికీపీడియా:మధ్యవర్తుల మండలి|en|WP:Arbitration Council|lt=మధ్యవర్తుల మండలి}} ఉంటుంది. ఈ మండలికి సభ్యులను, ఒక నిర్ణీత కాలానికి వాడుకరుల నుండి సముదాయం ఎన్నుకుంటుంది. తెవికీలో అలాంటి మండలి లేదు కాబట్టి, ఈ సమీక్షను సముదాయమే నిర్వహిస్తుంది.