దార అప్పలనారాయణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''కుమ్మరి మాస్టారు''' [[బుర్రకథ]] చెప్పడంలో ప్రసిద్ధిచెందిన కళాకారులు. ఇతని అసలు పేరు దార అప్పలనారాయణ. వీరు [[జూలై 1]], [[1930]] సంవత్సరంలో [[విజయనగరం]] జిల్లా, [[గజపతినగరం]] మండలం [[కోడిదేవుపల్లి]]లో అప్పలస్వామి మరియు చంద్రమ్మ దంపతులకు జన్మించారు.
వీరు ఎనిమిదవ తరగతి వరకు స్వగ్రామంలోనే చదివారు. 1947-49 మధ్యలో హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా శిక్షణ పొంది, 1950-56 మధ్య అధ్యాపకునిగా ఉద్యోగం చేశారు. ఉపాధ్యాయ శిక్షణా కాలంలో ప్రధానోపాధ్యాయులు గండికోట శ్రీరామమూర్తి ప్రోత్సాహంతో ముట్నూరి సూర్యనారాయణ దగ్గర బుర్రకథలో శిక్షణ పొందారు. వీరి తొలికథ 'స్వతంత్ర పోరాటం'. తొలికాలంలో నాటకాలలో పాత్రపోషణ చేస్తుండేవారు. 'అభ్యుదయ కళామండలి'ని స్థాపించారు. దీనిద్వారా అందించిన తొలి కానుక 'మల్లీశ్వరి'. వీని కథల ప్రత్యేకం వంతగా స్త్రీ కళాకారిణిని పరిచయం చేయడం మరియు హాస్యానికి పట్టం కట్టడం. కొన్ని సందర్భాల్లో గుమ్మెట, జముకు, డప్పు, ఢమరుకం, కంజీరా, డికీరా లాంటి దేశవాళీ సంగీతవాద్యాలను వినియోగిస్తూ కధ నడిపేవారు. ఎక్కువగా 'రామరాజ్యం', 'బాలనాగమ్మ', 'ఆంధ్రకేసరి', 'బొబ్బిలి యుద్ధం' వంటి కధాంశాలు ప్రదర్శించేవారు.
1964లో శృంగవరపు కోటలో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సమక్షాన 'చైనా భూతం' ప్రదర్శించారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బుర్రకథను ప్రదర్శించారు. 1984లో మహానాడులో 'రామరాజ్యం' బుర్రకథను రక్తికట్టించి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు అభినందనలు అందుకున్నారు. వీరి కధాగానం గ్రామోఫోన్ రికార్డులుగా కూడా విడుదలైంది. లాల్ బహదూర్ శాస్త్రి, కొళాయి-లడాయి, ఎలక్షన్ కామిక్ వంటి కథలు ఈ రికార్డులో ఉన్నాయి. 1967లో తెలుగు సినిమా రంగంలో కాలుపెట్టి [[కాంభోజరాజు కథ]], [[కన్యకా పరమేశ్వరి కథ]], [[రైతుబిడ్డ]], [[శభాష్ పాపన్న]] చిత్రాల్లో బుర్రకథ కళాకరునిగానే కనిపించి వినిపించారు. [[ఆకాశవాణి]], [[దూరదర్శన్]] లలో వివిధసమయాలలో కథాగనం చేశారు.
వీరు హాస్య నటనాధురీణ బిరుదాంకితులు. 1966లో భీమవరం త్యాగరాజు ఆరాధనోత్సవాలలో స్వర్ణ సింహతలాటాలు, కరకంకణాలు బహుమతిగా పొందారు. 1988 జూన్ 27న ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఆధ్వర్యంలో 'కళప్రపూర్ణ' గౌరవం అందుకున్నారు.
వీరు [[మే 24]], [[1997]] సంవత్సరంలో వీరు పరమపదించారు.
[[వర్గం:విజయనగరం జిల్లా ప్రముఖులు]]
|