"అప్పుచేసి పప్పుకూడు (1959 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

| టిక్కు
|}
==సాంకేతిక వర్గం==
* కథ: చక్రపాణి, యల్‌వి ప్రసాద్, వెంపటి సదాశివబ్రహ్మం;
* మాటలు: సదాశివబ్రహ్మం;
* పాటలు: పింగళి నాగేంద్రరావు;
* సంగీతం: ఎస్ రాజేశ్వరరావు;
* కళ: గోఖలే- కళాధర్;
* ఫొటోగ్రఫీ: మార్కస్ బారెట్లే;
* ఎడిటింగ్: కల్యాణ సుందరం, కె రాధాకృష్ణ;
* నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి;
* దర్శకత్వం: యల్‌వి ప్రసాద్;
* నిర్మాతలు: నాగిరెడ్డి, చక్రపాణి
 
==కథాంశం==
దివాన్ బహుద్దూర్ ముకుందరావు ([[ఎస్వీ రంగారావు]]) [[లక్షాధికారి]], అతని మనుమరాలు మంజరి (సావిత్రి) ఆయన ఆస్తికి ఒక్కగానొక్క వారసురాలు. ముకుందరావుకి తన మనుమరాలిని ఎవరైనా రాజుకిచ్చి పెళ్ళి చేయాలనే కోరిక ఉంటుంది. మంజరి రాజారావు ([[ఎన్టీఆర్]]) అనే దేశభక్తుడిని ప్రేమిస్తుంది. రాజారావు చెల్లెలు లీల ([[జమున]]). రావుబహుద్దూర్ రామదాసు ([[చిలకలపూడి సీతారామంజనేయులు]]) కొడుకైన రఘు ([[జగ్గయ్య]])తో వివాహమయి ఉంటుంది. విచిత్రంగా, రఘుకి లీల ఎలా ఉంటుందో తెలియదు. రఘు పైచదువులు చదువుటకు విదేశాలకు వెళ్తాడు. రామదాసు లీలను ఇంటినుండి తరిమేసి, లీల చనిపోయిందన్న అబద్దపు వార్త రఘుకు తెలుపుతాడు. ఇదంతా రాజారావు ఒక ఉద్యమంలో పాల్గొని చెరసాలకు వెళ్ళినప్పుడు జరుగుతుంది. చెరసాల నుండి విడుదలై రాజారావు తన చెల్లెల్ని తీసుకుని రామదాసు ఇంటికి అతనిని నిలదీయటానికి వెళ్తాడు. కానీ, ఇరువైపువారి పరువు కోసం లీలను మూగ పనిమనిషిలాగా రామాదాసు ఇంట్లో కొన్ని సమస్యలు తొలగిపోయేదాకా ఉండటానికి ఒప్పుకుంటాడు. రామదాసు కొందరి దగ్గర అప్పు చేసి వేరేవారికి అప్పులిస్తుంటాడు. రామదాసు దగ్గర గుమాస్తాగా భజగోవిందం (రేలంగి) పనిచేస్తుంటాడు. భజగోవిందం తన అత్త రాజారత్నం (సూర్యకాంతం) కూతురైన ఉష (గిరిజ)ను ప్రేమిస్తాడు. ఇది రాజారత్నం భర్త రామలింగం (రమణారెడ్డి)కి నచ్చదు, అతను కూతురికి పెళ్ళిచూపులు జరిపిస్తూవుంటే వాటిని భజగోవిందం తన సన్నిహితులతో కలిసి చెడగొట్టుతూ ఉంటాడు. చివరికి భజగోవిందం (రేలంగి) మేనమామ రామలింగం (రమణారెడ్డి) ఆటలుకట్టించి, అతని కూతురు ఉష (గిరిజ)తో భజగోవిందానికి వివాహం నిశ్చయింపచేస్తాడు. పనిమనిషి తన భార్య లీలేనని గ్రహించిన రఘు, రాజాకు సాయపడతాడు. చివరకు అంతాకలిసి ‘రామదాసు’కు బుద్ధివచ్చేలా చేస్తారు. జరిగినదంతా గ్రహించిన ముకుందరావు పేదవాడైనా రాజాకే తన మనుమరాలిని ఇచ్చి వివాహం చేస్తాననటంతో -రామదాసే రాజా, మంజరిల చేతులు కలపుతాడు. కథ శుభంగా ముగుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2581652" నుండి వెలికితీశారు