→‎నాయీబ్రాహ్మణ: కొత్త విభాగం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 216:
నమస్కారం పవన్ గారు. నాయీబ్రాహ్మణ అనే వికీపీడియా ను వ్యక్తిగత ఇష్టంగా మార్పులు చేసి లాక్ చేసేరు మీరు గమనించగలరు [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 04:01, 10 ఫిబ్రవరి 2019 (UTC)
: [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] గారూ, కులాలపరంగా గతంలో జరిగిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దుకునే స్థితిలో భారతదేశం ఉన్నదనీ, ఈ రివిజనిస్టు ధోరణితో అణచివేయబడ్డ పలు కులాలు తిరగబడి ముందుకువస్తున్నాయని, ఇదొక శుభపరిణామమనీ నా వ్యక్తిగత అవగాహన. ఆ స్థితిలో పలు కులాల వారు తమ తమ చరిత్రలను తిరగరాసుకుంటున్నాయి. గత యాభై ఏళ్ళ నాడు కమ్మ కులస్తులు ఎలాగైతే తెలుగు నాట ప్రసిద్ధ రాజవంశాలతో తమను ఐడెంటిఫై చేసుకున్నారో, అలానే ప్రస్తుతం పలు కులాలు చరిత్రలు తిరగరాస్తున్నాయి. ఐతే వికీపీడియాలో రాసేప్పుడు ఆబ్జెక్టివ్ గా రాయాలి. చారిత్రకంగా వేల యేళ్ళ నాటి రాజవంశాలతో మన కులాలకు నేరుగా సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కష్టం. అదీ కేవలం పునరుజ్జీవన కోణంతో, ఉద్వేగపూర్వకంగా రాసిన <strike>వ్యాసాలతో</strike> పుస్తకాల ఆధారంగా చేయడం మరీ కష్టం. మీరు ఆ ప్రయత్నం చేయడం కనిపిస్తోంది. క్షమించాలి. నాకు తెలిసి గత రెండు వందల సంవత్సరాలుగా నాద స్వర విద్వాంసులు నాయీ బ్రాహ్మణ కులానికి చెందినవారు తెలుగు నాటే ఆ కళకు వైభవం కల్పించారు. [http://sathyakam.com/pdfImageBook.php?bId=10664 ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర] పేరిట రెండు ఎడిషన్లు భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు రాశారు. అలాంటి ప్రామాణిక రచనలు స్వీకరించి ఆ కోణంలో వ్యాసానికి మీరు పుష్టి కలిగించవచ్చు కదా? రాజవంశాల విషయం రాయవలిసి వస్తే "ఫలానా గ్రంథకర్త భావిస్తున్నారు" అనే రాయాలి. [[కమ్మ#పుట్టు_పూర్వోత్తరాలు]] చూడండి. ఫలానా దుర్జయ వంశం, ఫలానా కాకతీయులు కమ్మవారు అన్న ధోరణిలో కాక దాన్ని కొందరు భావిస్తారనే మార్చాం. ఇది మాకు తెలిసినంతవరకూ [[వికీపీడియా:తటస్థ దృక్కోణం]] కింద సరైన పద్ధతి. దయచేసి ఆ పద్ధతులు ప్రాక్టీసు చేయండి. అందుకు [[వాడుకరి:Nayeevaidya/ప్రయోగశాల]] అన్న పేజీ తయారుచేసుకుని అందులో చేయండి. మీరు ఆ కోణంలో కొంతమేరకు అక్కడ పనిచేస్తే తర్వాత ఆయా వ్యాసాలను తరలించడమో, మీతోనే కాపీ చేయించడమో చేయవచ్చు. వికీపీడియా సిద్ధాంతాల పట్ల మాకున్న నిబద్ధత, అణచివేతకు గురైన కులాల పునరుజ్జీవనం పట్ల నాకు వ్యక్తిగతంగా ఉన్న ఆశాభావం వల్ల ఇదంతా చెప్పుకొచ్చాను. మీరు ఏ అంశాన్నైనా విభేదించవచ్చు. కానీ నేను పైన ఇచ్చిన తటస్థ దృక్కోణం లింకు తప్పనిసరిగా చదవండి. నొప్పించి ఉంటే క్షమించండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:30, 10 ఫిబ్రవరి 2019 (UTC)
 
== నాయీబ్రాహ్మణ ==
 
నేను రాజవంశాల గురించి కాకుండా నాయీబ్రాహ్మణులు షెడ్యూల్ కులాలుగా మార్చాలి అనే పదం గురించి నేను వ్యతిరేకిస్తున్నాను [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 04:34, 10 ఫిబ్రవరి 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Pavan_santhosh.s" నుండి వెలికితీశారు