"నందమూరి తారక రామారావు" కూర్పుల మధ్య తేడాలు

→‎చలనచిత్ర జీవితం: వ్యక్తిగత అభిప్రాయాలు తొలగింపు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(→‎చలనచిత్ర జీవితం: వ్యక్తిగత అభిప్రాయాలు తొలగింపు)
ట్యాగు: 2017 source edit
<nowiki/><!--ఆ సమయంలో రామారావు డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి బస్సు చార్జీలకు కూడా డబ్బుండేది కాదు.-->
 
[[1951]]లో కె.వి.రెడ్డి [[పాతాళభైరవి]], దాని తరువాత అదే సంవత్సరం [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్‌.రెడ్డి]] [[మల్లీశ్వరి]], [[1952]]లో ఎల్వీ ప్రసాదు [[పెళ్ళిచేసి చూడు]], ఆ తరువాత వచ్చిన [[కమలాకర కామేశ్వరరావు]] చిత్రం [[చంద్రహారం]] ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. [[పాతాళభైరవి]] 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది స్ఫురద్రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయాడు.
 
[[1956]]లో విడుదలైన [[మాయాబజార్‌]]లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. [[1959]]లో [[ఏ.వి.యం.ప్రొడక్షన్స్]] వారు నిర్మించి, విడుదల చేసిన [[భూకైలాస్]] చిత్రంలో [[రావణబ్రహ్మ]] పాత్రకు <!--నటించేందుకు ఆయన రావణుడి గూర్చి అధ్యయనం చేసి,--> రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. <!--మరెవ్వరూ ఆ పాత్రకు రామారావుగారిలా న్యాయం చేయలేరు. -->[[1960]]లో విడుదలయిన [[శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]] భారీ విజయం సాధించింది. <!--ఆ సినిమా చూసి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎన్.టీ.ఆర్. దర్శనం కోసం ఆయన ఇంటి ముందు వరుసలు కట్టారు.--> [[శ్రీమద్విరాటపర్వము]]లో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. [[1963]]లో విడుదలైన [[లవకుశ]] అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. [[1972]]నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2584727" నుండి వెలికితీశారు