కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్ర ఉత్సవానికి ముందు నలభై రోజుల పాటు వేలాది భక్తులు శ్రీ మేధా దక్షిణామూర్తి దీక్షను స్వీకరిస్తారు. దీనికే ‘’కోటప్ప దీక్ష‘’అని పేరు. నియమ నిష్టలతో భక్తీ విశ్వాసాలతో శివనామస్మరణ, శివ పంచాక్షరీ జపాలతో, అభిషేకాలతో, సంత్సంఘాలతో, ఉపవాసాలతో ఆలయం పులకించిపోతుంది. ‘’దక్షినానన దక్షినానన దక్షినానన పాహిమాం–త్రికోటేశ్వర త్రికోటేశ్వర త్రికోటేశ్వర రక్షమాం‘’ అని శివస్మరణ చేస్తూ ఆలయం అపరకైలాసాన్ని స్పురణకు తెస్తుంది. మేధా దక్షిణామూర్తి భక్త సమాజం వారు 46 రోజుల పాటు 35 మంది వేద పండితులతో ‘’మహా రుద్ర యాగ పూర్వా కోటి బిల్వార్చన’’, నిరతాన్న దానాలు, గోస్టులు, సాంస్కృతిక కార్యకలాపాలతో కళకళ లాడుతుంది ప్రాంగణం అంతా. కోరిన కోర్కేలను తీర్చే కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించి భక్తులు తరిస్తారు.
 
{{వ్యాఖ్య|'''’’శివః కారయితాకర్తా-శివో భోజయితా భోక్తా శివః -ప్రీణాతు శంకరః ‘’'''<br /><br /> }}
 
క్రీస్తు శకం 6, 7శతాబ్దాల్లోనే ఈ ప్రాంతాన్ని ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు పాలించి త్రికూటాధిపతులుగా బిరుదులు పొందారు. నిర్మలత్వం,  ప్రశాంతత మూర్తీభవించిన ఓంకార స్వరూపుడు దక్షిణామూర్తి. ఈ స్వామి అనుగ్రహంతో సర్వవిద్యలు లభిస్తాయని ప్రతీతి. దక్షిణాభిముఖంగా ఆశీనుడైన మూర్తి కనుక దక్షిణామూర్తి పేరు సార్థకమైందని చెబుతారు. 200 ఏళ్లకు పూర్వం బ్రహ్మశిఖరంపై పినపాడు వేలేశ్వర అయ్యవారు జనాకర్షణ, మొక్కుబడులు, అష్టదిగ్బంధ గణపతి, సంతాన కోటేశ్వర యంత్రాలు స్థాపించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి. మేధాదక్షిణా మూర్తి వద్ద విష్ణువు కూడా బ్రహ్మోపదేశం పొందినట్లు స్థల పురాణం చెబుతోంది. దీంతో ఇక్కడ విష్ణు శిఖరం ప్రసిద్ధి చెందింది. అయితే పూర్వాశ్రమంలో ప్రజలకు ఇవి తెలియవు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కోటప్పకొండకు ఘాట్‌ రోడ్డు నిర్మాణం చేయించారు. ఘాట్‌ రోడ్డులోని రెండు మలుపుల్లో బ్రహ్మదేవుని విగ్రహాన్ని అదే మలుపులో మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆదిశేషుని విగ్రహాలను ఏర్పాటు చేయించారు. కొండపైన భారీ వినాయకుని విగ్రహాన్ని కూడా నిర్మించారు.
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు