జూనియర్ ఎన్.టి.ఆర్.: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నందమూరి తారక రామారావు గారి మనవడిగా ''''నిన్ను చూదాలని'''' చిత్రం ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
చిత్రం ద్వారా కుర్రాడు బాగా చేశాడు అని అనిపించుకున్నాడు.ఆ చిత్రం విజయవంతమవడం తో విరివిగా అవకాశాలు రాసాగాయి.ఆ తర్వాత వచ్చిన ''''సుబ్బు'''' నిరాశ పరిచినా ఆ తర్వాత '''వి.వి.వినాయక్''' దర్శకత్వం లో వచ్చిన ''''ఆది '''' చిత్రం లో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. ఆ చిత్రం లో అతను చూపించిన నటనతో తాతకు తగ్గ మనవడనిపించుకున్నాడు.
 
అల్లరి రాముడు నిరాశ పరిచినా '''సింహాద్రి''' చిత్రం తో చరిత్ర సృష్టించాడు. ఆ చిత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది.ఈ సినిమా విజయం తో అతను అగ్ర నటుడిగా ఎదిగాడు.
 
ఐతే సింహాద్రి చిత్రం తర్వాత అతన్ని వరుసగా పరాజయాలు పలకరించాయి.బాగా లావయ్యడన్న విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా ఆంధ్రావాలా , సాంబ , నా అల్లుడు , నరసింహుడు , అశోక్ , రాఖీ ఆశించిన విజయాన్ని అందించలేక పోయాయి. ఐతే రాఖీ చిత్రం లో అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది.ఇలా నాలుగు సంవత్సరాలు అతను విజయం కోసం అలమటించాడు.
2007 లో గత చిత్రాలు''' స్టూడెంట్ నెం.1''' , '''సింహాద్రి''' ల దర్శకుడు '''ఎస్.ఎస్.రాజమౌళి''' దర్శకత్వం లో వచ్చిన '''యమ దొంగ''' తో ఘన విజయాన్ని సాధించాడు. ఈ చిత్రం లో కాసేపు యముడి పాత్ర లో కనిపించి పౌరాణిక పాత్రల లోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సన్నబడి లావవుతున్నాడన్న విమర్శలను తిప్పి కొట్టాడు.
ఇక 2008 లో '''మెహర్ రమేష్''' దర్శకత్వం లో '''కంత్రీ''' గా తెర పైకి రానున్నాడు.
"https://te.wikipedia.org/wiki/జూనియర్_ఎన్.టి.ఆర్." నుండి వెలికితీశారు