కథానాయకుడు (1969): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
[[ముళ్ళపూడి వెంకటరమణ]] రాసిన రాజకీయాలపై రాసిన వ్యంగ్య కథల మాలిక [[రాజకీయ బేతాళ పంచవింశతిక]]. అందులోని ఒకానొక చిన్న కథ-స్వామి ద్రోహి కథ. కథానాయకుడు సినిమా ఆ కథను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చేశారు. [[ముళ్ళపూడి వెంకటరమణ]] ఆ కథను ఆధారంగా చేసుకుని 150 పేజీల్లో సీన్ల విభజనతో సహా ట్రీట్మెంట్ రాశారు. అయితే రమణ అప్పటికే రచయితగా, నిర్మాతగా బిజీ అయిపోవడంతో సంభాషణలు [[భమిడిపాటి రాధాకృష్ణ]] రాశారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref>
==కథ==
ఒక పట్టణంలో ప్రజాసేవకులుగా పేరొందిన వ్యక్తులు దయానందం (నాగభూషణం), కంట్రాక్టర్ సత్యమూర్తి (మిక్కిలినేని). రేషన్‌షాపు ఓనర్ అప్పడు (అల్లు రామలింగయ్య), దయానందం సెక్రటరీ తాతారావు (కాకరాల), ప్రభుత్వ వైద్యుడు (డాక్టర్ రమేష్) న్యాయం, ధర్మం, నీతి నిజాయితీలకు తిలోదకాలిస్తారు. తమ అక్రమాలకు అడ్డుతగులుతున్న ధర్మారావును హత్యచేసి, గుండె జబ్బని ప్రచారం చేస్తారు. శిలా విగ్రహం ఏర్పాటు కోసం చందాలు వసూలు చేసి పంచుకుంటారు. దయానందం పెద్ద గుమాస్తా శ్రీనివాసరావు (ధూళిపాళ) నీతి నిజాయితీ కలవాడు. అతని భార్య టిజి కమలాదేవి, కూతురు శారద (కుట్టి పద్మిని), ఒక కొడుకు భరత్, అతని తమ్ముడు సారథి (యన్‌టి రామారావు). చిన్న ఉద్యోగం చేస్తూ నిజాయితీగావుంటూ దయానందం అక్రమాలకు అడ్డుతగులుతుంటాడు సారథి. అందుచేత వారు అతని ఉద్యోగం ఊడగొడతారు. అన్నచేత ఇంటినుంచి గెంటి వేయిస్తారు. పార్కులో పరిచయమైన పండ్లు అమ్ముకునే యువతి జయ (జయలలిత), ఆమె అన్న నాగులు (ప్రభాకర్‌రెడ్డి), గూడెం ప్రజల ఆదరణతో వారివద్ద పాకలో నివసిస్తుంటాడు సారథి. వాళ్ల సాయంతో ఆ పట్టణానికి చైర్మన్‌గా ఎన్నికవుతాడు. అక్కడ కూడా ఈ ప్రజాసేవకుల ఆటలు సాగనీయక పోవటంతో వారు అవిశ్వాస తీర్మానం ద్వారా అతన్ని పదవీచ్యుతుణ్ని చేస్తారు. విసిగిపోయిన సారథి, సిబిఐ ఆఫీసర్ జోగారావు (ముక్కామల) సాయంతో వారిని మోసంతో గెలుస్తాడు. అవినీతిపరుల్ని చట్టానికి పట్టించి కథానాయకుడు అనిపించుకుంటాడు. అన్న కుటుంబం, జయతో కలిసి కొత్త జీవితం ప్రారంభించుటంతోప్రారంభించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది<ref name="ఫ్లాష్ బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ 50 కథానాయకుడు |url=http://www.andhrabhoomi.net/content/flashback50-46 |accessdate=17 February 2019 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=16 February 2019}}</ref>.
 
==సాంకేతిక వర్గం==
"https://te.wikipedia.org/wiki/కథానాయకుడు_(1969)" నుండి వెలికితీశారు