ఆస్తానయె షామీరియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
కమాలుద్దీన్ బాద్ షాహ్ బాల్యం వుఛ్ లో గడిచింది. అప్పటి ఒక సంఘటన - కమాలుద్దీన్ మసీదులో ఆడుకుంటున్నాడు. అక్కడ ఒక శవాన్నుంచుకుని పెద్దలు ప్రార్థన చేస్తున్నారు. కమాలుద్దీన్ ఆ శవాన్ని చూశాడు. 'ఖూమ్ బి ఇజ్ నిల్లాహ్ ' అన్నాడు. 'దేవుని ఆజ్ఞతో లెమ్ము ' అని ఆ వాక్యానికి అర్థం. శవానికి ప్రాణం వచ్చింది. ఆ తర్వాత ఆయన తండ్రి కొడుకును వారించాడు: "ఇలాంటి మహిమ గల వాక్కులు పలుకవద్దని". ఆ తండ్రీకొడుకులు గుల్బర్గా వచ్చారు.
 
కమాలుద్దీన్ బాద్షాహ్ గుల్బర్గా నుంచి కడపకు వచ్చాడు. వీరు గుల్బర్గా ఖాజా బందా నవాజ్ వంశీకులు అంటారు. తాను నిర్మించుకున్న దర్గాకు తానే పీఠాధిపతి కమాలుద్దీన్ బాద్ షాహ్. ఆయన వంశం వారే ఆ దర్గాకు పీఠాధిపతులు అవుతున్నారు. దర్గా పక్కనే మసీదు ఉందేది. ఆ స్థానంలోనే ఇప్పటి కొత్త మసీదు నిర్మించారు. పాత మసీదు కట్టించింది పూర్వ పీఠాధిపతి బేరంగ్ సయ్యద్ మహమ్మద్ హుసేనీ. ఈ మసీదు నిర్మాణం హిజరీ 1230 (క్రీ.శ.1810)లో జరిగింది. కడప జిల్లా కలెక్టరుగాను, మద్రాసు గవర్నరుగాను పని చేసిన మన్రో దొర ఈ మసీదు నిర్మాణానికి ఇనాములు ఇవ్వజూపాడు. పీఠాధిపతి హుసేనీ స్వీకరించలేదు. దర్గా పక్కనే ఉన్న దీవాన్ సాహెబ్ అనే ఫకీరు చెయ్యి చాపాడు. ఆయనకు నెలకు 4 రూ||లు భృతి మన్రో దొర ఏర్పాటు చేశాడు. ఆ భృతి వంశపారంపర్యంగా నడచింది.
"https://te.wikipedia.org/wiki/ఆస్తానయె_షామీరియా" నుండి వెలికితీశారు