ఆస్తానయె షామీరియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆస్తాన్-ఎ-షామీరియా [[కడప]] పట్టణంలో ఉంది. దీనినే షామీరియా దర్గా అని పిలుస్తారు. కడప పట్టణంలోని కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా [[బుగ్గవంక]] ఎడమ గట్టు మీద ఈ షామీరియా దర్గా ఉంది. షామీరియా దర్గాను కడపలో నెలకొల్పింది కమాలుద్దీన్ బాద్ షాహ్. వీరి పూర్వులు పూర్వపు [[రష్యా]] (USSR) కు చెందిన [[బుఖారా]] (ప్రస్తుతము [[ఉజ్బెకిస్తాన్]]లో ఉన్నది) ప్రాంతానికి చెందినవారు. వీరు [[ఆఫ్గనిస్థాన్]] మీదుగా [[భారతదేశం]]లోనికి ప్రవేశించారు. ఇప్పటి [[పాకిస్తాన్]] కు చెందిన [[వుఛ్]] ప్రాంతం నుంచి [[గుల్బర్గా]]కు అటు నుంచి కడపకు వచ్చారు.
 
కమాలుద్దీన్ బాద్ షాహ్ బాల్యం వుఛ్ లో గడిచింది. అప్పటి ఒక సంఘటన - కమాలుద్దీన్ మసీదులో ఆడుకుంటున్నాడు. అక్కడ ఒక శవాన్నుంచుకుని పెద్దలు ప్రార్థన చేస్తున్నారు. కమాలుద్దీన్ ఆ శవాన్ని చూశాడు. 'ఖూమ్ బి ఇజ్ నిల్లాహ్ ' అన్నాడు. 'దేవుని ఆజ్ఞతో లెమ్ము ' అని ఆ వాక్యానికి అర్థం. శవానికి ప్రాణం వచ్చింది. ఆ తర్వాత ఆయన తండ్రి కొడుకును వారించాడు: "ఇలాంటి మహిమ గల వాక్కులు పలుకవద్దని". ఆ తండ్రీకొడుకులు గుల్బర్గా వచ్చారు. కమాలుద్దీన్ బాద్షాహ్ గుల్బర్గా నుంచి కడపకు వచ్చాడు. వీరు గుల్బర్గా ఖాజా [[బందా నవాజ్]] వంశీకులు అంటారు. తాను నిర్మించుకున్న దర్గాకు తానే పీఠాధిపతి కమాలుద్దీన్ బాద్ షాహ్. ఆయన వంశం వారే ఆ దర్గాకు పీఠాధిపతులు అవుతున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఆస్తానయె_షామీరియా" నుండి వెలికితీశారు