విజయశాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 26:
[[జయసుధ]], [[జయప్రద]] అభినయంతో, [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], [[మాధవి]] అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది '''విజయశాంతి''' సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. [[భారతీరాజా]] వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనదంటూ ఓ గుర్తింపుకోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి నాలుగేళ్లలో [[కిలాడీ కృష్ణుడు]], [[పెళ్లీడు పిల్లలు]], [[సత్యం -శివం]], [[వంశగౌరవం]], [[కృష్ణావతారం]], [[రాకాసి లోయ]], [[పెళ్ళి చూపులు (సినిమా)|పెళ్లిచూపులు]] మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడి పాడే కథానాయిక వేషాలే వరించాయామెని. ఈ కాలంలో రాశి పరంగా తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ అవేవీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. పైపెచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా. 1981లో వచ్చిన [[రజంగం]] అనే [[తమిళ]] చిత్రంలో స్విమ్ సూట్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె.
 
1983లో [[టి. కృష్ణ]] రూపంలో అదృష్టం ఆమె [[తలుపు]] తట్టింది. [[ప్రజా నాట్య మండలి]] నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలుగల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి. కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేకమందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయిక పాత్రలో జీవించడం ద్వారా [[నేటి భారతం]] ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది విజయశాంతి. అలా, తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కథానాయికలను సవాలు చేస్తూ మరో తార ఉద్భవించింది. అటుపై అందొచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని మరో రెండేళ్లలో ఆ తార ఎవరికీ అందనంత ఎత్తెదిగి ధ్రువతారగా నిలిచింది. [[నేటి భారతం]] చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వప్రభుత్వం నుంచి [[నంది బహుమతి]]<nowiki/>ని కూడా గెలుచుకుంది.
 
=== 1984 నుండి 1985 ===
"https://te.wikipedia.org/wiki/విజయశాంతి" నుండి వెలికితీశారు