విజయశాంతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 31:
ఆ తరువాత రెండేళ్లపాటు రెండుపడవల ప్రయాణంలా సాగిందామె సినీ పయనం. ఒక వైపు [[నేటి భారతం]]తో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరో వైపు సగటు సినీ వీక్షకులనలరించే గ్లామర్ అద్దిన మసాలా పాత్రలు అలవోకగా పోషిస్తూ 1986నాటికి తెలుగు వెండితెరపై వెలిగే తారామణుల్లో ఒకటి నుండి పది వరకూ అన్ని స్థానాలు తనవే అనే స్థాయికి చేరిపోయిందామె. ఆమె తరువాతి స్థానాల్లో [[రాధ]], [[సుహాసిని]], [[రజని]], [[రాధిక]] వంటి వారుండేవారు.
 
1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శంచిన సంవత్సరం. ఆ ఏడాది [[వందేమాతరం]], [[దేశంలో దొంగలు పడ్డారు]], [[దేవాలయం]], [[ప్రతిఘటన]] వంటి ప్రగతిశీల చిత్రాల్లో ''రెబల్'' ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ, [[అగ్ని పర్వతం]], [[పట్టాభిషేకం]], [[చిరంజీవి]], [[దర్జాదొంగ]], [[ఊరికి సోగ్గాడు]], [[శ్రీవారు]] వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడి పాడే చిలిపి కథానాయికగానూకథానాయికగా నటించి తను రెండువిధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని ఋజువుచేసింది. [[ప్రతిఘటన]]తో అభినయ పరంగా తనకెదురే లేదని నిరూపించుకోగా, [[జడగంటలు]]లో టు-పీస్ బికినీ ధరించి అందాల ప్రదర్శన విషయంలో కూడా తనకు హద్దులు లేవని చాటి చెప్పింది. పైన పేర్కొన్న పది చిత్రాల్లో ఒక్క [[చిరంజీవి]] తప్ప మిగిలినవన్నీ విజయవంతం కావటం విశేషం. [[ప్రతిఘటన]] చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండవసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవటమే కాకుండా ప్రేక్షకులలో ఆమెకంటూ ప్రత్యేకమయిన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో అప్పటిదాకా సౌజన్యం మూర్తీభవించిన కథానాయిక పాత్రలకు [[సావిత్రి]], [[జయసుధ]], హుందాతనం ఉట్టిపడే పాత్రలకు [[షావుకారు జానకి]], పురుషులను ధిక్కరించే అహంకారపూరిత మహిళామణుల పాత్రలకు [[భానుమతి]], [[వాణిశ్రీ]], మొండితనం నిండిన పాత్రలకు [[జమున]], అందచందాలతో అలరించే పాత్రలకు [[కృష్ణ కుమారి]], [[బి. సరోజా దేవి]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] .. ఇలా ఒక్కో రకం కథానాయిక పాత్రకు ఒక్కో నటీమణి పేరొంది ఉండగా, అవన్నీ ''విజయశాంతి'' ఒక్కటే ఏక కాలంలో పోషించగలదనీ, పోషించి ప్రేక్షకులను మెప్పించగలదనీ నిరూపించిందా సంవత్సరం.పేరొందింది ఆ ఏడాది ఆమె మొత్తం పదమూడు తెలుగు చిత్రాల్లో నటించగా వాటిలో పదకొండు విజయవంతమయ్యాయి. అంతటితో ఆమె తమిళ చిత్రాల్లో నటించడం ఆపేసి తెలుగు చిత్రాలపైనే దృష్టి కేంద్రీకరించింది.
 
=== 1986 నుండి 1990 ===
"https://te.wikipedia.org/wiki/విజయశాంతి" నుండి వెలికితీశారు