విజయశాంతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 54:
 
=== 1996 నుండి 2000 ===
ఈ ఐదేళ్ల కాలంలో విజయశాంతి ప్రభ ఆకాశమంత ఎత్తెదిగి క్రమంగా క్షీణించనారంభించింది. 1993 లో వచ్చిన [[పోలీస్ లాకప్]] తరువాత వరుసగా రెండేళ్లపాటు ఆమెకు సిల్వర్ జూబిలీజూబ్లీ సినిమాలు కరువయ్యాయి. దానితో ఆమె 1996 లో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. సరైన కథ లేకుండా నటించటానికి ఆమె ఇష్టపడక పోవటం దీనికి కారణం. 1980లో తెలుగు చిత్ర సీమలో ప్రవేశంచాకప్రవేశించాక ఆమె నటించిన తెలుగు సినిమా ఒక్కటీఒక్కటి విడుదల కాని మొదటి ఏడాది అది. ఆ ఏడాది ఆమె [[యంగ్ టర్క్స్]] అనే మలయాళ చిత్రంలో మాత్రమే నటించింది. ఆ చిత్రం [[ఢిల్లీ డైరీ]]గా తెలుగులోకి అనువదించబడింది కానీ పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు.
 
ఏడాది పాటు ఆమె తెలుగు సినిమాలు విడుదల కాలేదన్న అభిమానుల బాధను మరపిస్తూ 1997 మార్చి 7 న విడుదలయింది [[ఒసేయ్ రాములమ్మా]]. [[దాసరి నారాయణ రావు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలయిన మొదటి రోజునుండి అన్ని అంచనాలనూ మించిపోతూ తెలుగు చిత్ర సీమలో నాటి వరకూ ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిందీ చిత్రం. అదే ఏడాది విడుదలై విజయవంతమయిన [[హిట్లర్ (సినిమా)|హిట్లర్]], [[అన్నమయ్య]], [[తొలిప్రేమ]], [[ప్రేమించుకుందాం.. రా]] వంటి ఇతర చిత్రాలకంటే మిన్నగా వసూళ్లు సాధించి ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్నా [[ఆంధ్ర ప్రదేశ్]] బాక్సాఫీసుల వద్ద విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిందా చిత్రం. నాలుగో సారి [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును ఆమెకి సంపాదించిపెట్టటమే కాకుండా, [[అడిమై పెణ్]] పేరుతో తమిళంలోనికి అనువాదమై అక్కడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది ఈ సినిమా. [[ఆర్. నారాయణ మూర్తి]] స్ఫూర్తితో ప్రముఖ దర్శక నిర్మాతలెందరో పోటీలు పడి ''ఎర్ర'' సినిమాలు నిర్మిస్తున్న తరుణంలో అదే ఒరవడిలో వచ్చిన [[ఒసేయ్ రాములమ్మా]] అంతకు ముందు, ఆ తరువాత వచ్చిన ఎర్ర సినిమాలన్నింటికీ తలమానికంగా నిలిచింది. (ఈ చిత్రంలోని పాటల కోసం [['వందేమాతరం' శ్రీనివాస్]] కట్టిన ప్రజాబాణీలు 'నభూతో' అనిపించుకున్నాయి) ఆ చిత్రంలో విజయశాంతి పోషించిన ''రాములమ్మ'' పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందంటే, అప్పటి నుండి ప్రేక్షక జనం ఆమెను అభిమానంతో '''రాములమ్మ''' గా పిలుచుకోనారంభించారు. ఆ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ధియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సద్దుమణగక ముందే, 1997 జూన్ నెలలో ఆమె ఎవరూ ఊహించని విధంగా అప్పటి కేంద్ర హోం మంత్రి [[ఎల్. కె. అద్వానీ]] సమక్షంలో [[భారతీయ జనతా పార్టీ]]లో చేరి మరో సంచలనం సృష్టించింది. రాజకీయ నాయకురాలిగా విజయశాంతి ప్రస్థానం గురించి మరోచోట విపులంగా చదువుకుందాం.
 
1997 లోనే ఆమె [[గూండా గర్దీ]] అనే హిందీ చిత్రంలో నటించగా అది కూడా విజయవంతమయింది. ఈ సినిమా [[శోభన]] ప్రధాన పాత్రలో నటించిన [[అస్త్రం]] (1991) అనే తెలుగు సినిమాకు హిందీ రీమేక్. అదే ఏడాది నవంబరు 7న [[దాసరి నారాయణ రావు]] దర్శకత్వంలోనే, [[ఒసేయ్ రాములమ్మా]]కి పనిచేసిన తారా గణం, సాంకేతిక బృందం తోనే నిర్మించబడిన [[రౌడీ దర్బార్]] విడుదలైంది. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది కానీ బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ లాభాలు అర్జించింది.
 
[[ఒసేయ్ రాములమ్మా]] తరువాత విజయశాంతిని ఘన విజయాలు పలకరించటం మానేశాయి. 1998లో వచ్చిన [[శ్రీవారంటే మావారే]] ఆమెని అప్పటికి సుమారు దశాబ్ద కాలంగా ప్రేక్షకులు అలవాటు పడ్డ రఫ్ అండ్ టఫ్ పాత్రలో కాకుండా అమాయకత్వం కొంత, జాణతనం మరికొంత కలగలిసిన తెలంగాణ పడుచు ''నాగమణి'' పాత్రలో విభిన్నంగా చూపించి కొంత వరకూ విజయం సాధించింది. ఎక్కువ కాలం నిర్మాణంలో ఉండటం వలనా, విడుదలానంతరం సరైన ప్రచారం కొరవడటం వలనా ఈ చిత్రం బాగున్నప్పటికీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత వచ్చిన చిత్రాలేవీ పెద్ద విజయం సాధించలేదు. ఉన్నంతలో 1999లో వచ్చిన [[భారత రత్న]] ఫరవాలేదనిపించింది. ఈ చిత్రంలో ఆమె ఒక పాట కూడా పాడటం విశేషంపాడారు. [[ఛోటి ఛోటి దొంగతనం మాని వేయరా]] అంటూ [[ఉదిత్ నారాయణ్]]తో కలిసి ఆమె ఆలపించిన ఆ పాట అభిమానులను బాగానే అలరించింది.
 
=== 2000 నుండి 2006 ===
"https://te.wikipedia.org/wiki/విజయశాంతి" నుండి వెలికితీశారు