చాగల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 106:
 
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. చాగల్లులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
 
==చాగల్లు చరిత్ర==
ఈ గ్రామనికి చాగల్లు అనే పేరు రావడం వెనుక చిన్న చరిత్ర కలదు. నిరవద్యపురంగా పిలిచే నిడదవోలును ఆరోజులలో తూర్పు చాళుక్యు పరిపాలించునపుడు నగరాలకి దూరంగా ఖైదీలను ఉంచి శిక్షించేవారు. ఆ శిక్షించే ప్రాంతాన్ని "చావుల కొలను" గా (శిక్షలు విధించే స్థలంగా చెప్పవచ్చు) పేర్కొనేవారు. కాలక్రమేణా చావుల కొలను, చావుకొల్లు గాను, ఆ తర్వాత చాగల్లుగాను మార్పు చెందినది. నిరవద్యపురం [[నిడదవోలు]] చరిత్ర, వయస్సు ప్రకారం చూస్తే ఈ చాగల్లుకు కూడా సుమారు 1000 సం.ల వయస్సు ఉంటుందనుకోవచ్చు. ఈ విషయాలు ప్రముఖ జర్నలిస్టు శ్రీ గోపరాజు వెంకటానందం గారు వ్రాసిన [[నిడదవోలు]] చరిత్రలో ఉన్నాయి. ఇది ఒక ప్రముఖ మండల కేంద్రం.
"https://te.wikipedia.org/wiki/చాగల్లు" నుండి వెలికితీశారు