జమలాపురం కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''సర్దార్ జమలాపురం కేశవరావు''' ([[సెప్టెంబరు 3]], [[1908]] - [[మార్చి 29]], [[1953]]), [[నిజాం]] నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. [[హైదరాబాదు]] రాష్ట్రానికి చెందిన ప్రముఖ [[స్వాతంత్ర్య సమరయోధుడు]] .<ref name="jamalapuram">{{Cite news|url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Jamalapuram-Kesava-Rao-centenary-fete/article16631242.ece|title=Jamalapuram Kesava Rao centenary fete|date=2009-03-06|work=The Hindu|issn=0971-751X|access-date=2018-12-24}}</ref>. [[ఆంధ్ర ప్రదేశ్]] కాంగ్రేస్కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించాడు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’ గా పిలుచుకుంటారు.
 
==జీవిత విశేషాలు==
దక్కన్‌ సర్దార్‌గా, ఉక్కు మనిషిగా ప్రజలు పిలుచుకునే కేశవరావు [[నిజాం]] సంస్థానంలో తూర్పు భాగాన ఉన్న [[ఖమ్మం]] (నాటి వరంగల్ జిల్లా)లోని [[ఎర్రుపాలెం]]లో [[1908]] [[సెప్టెంబర్ 3]] న జమలాపురం వెంకటరామారావు, వెంకటనరసమ్మలకు తొలి సంతానంగా జన్మించాడు. సంపన్న జమీందారీ వంశంలో పుట్టినా, నాటి దేశ రాజకీయాలు అతనిని ఎంతగానో కలవరపరచాయి. [[ఎర్రుపాలెం]] లో ప్రాథమిక విద్య అనంతరం, [[హైదరాబాదు|హైదరాబాద్‌]]<nowiki/>లోని [[నిజాం కళాశాల]]<nowiki/>లో ఉన్నత విద్యను అభ్యసించాడు. వందేమాతరం గీతాలాపనను నిషేధించినందుకు నిరసనగా, కళాశాల విద్యార్థులను కూడగట్టి, నిరసనోద్యమంలోకి దిగారు. గీతాన్ని ఆలాపించనివ్వకపోతే తరగతులకు హాజరుకాబోమని హెచ్చరించారు. దీంతో చివరకు నిజాం పాలకవర్గం నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. ఈఘటన తర్వాత కేశవరావు ఆలోచనా పరిధిని మరింత విస్తృతం చేసి ఆయన వెళ్లాల్సిన మార్గాన్ని మరింత స్పష్టం చేసింది. ఆరడుగుల ఆజానుబాహువైన కేశవరావు, ఎత్తుకు తగ్గ దృఢమైన శరీరం, చెరగని చిరునవ్వుతో నిండుగా కనిపించేవాడు. నిజాం పాలనలో కొనసాగుతున్న వెట్టి చాకిరితో అష్టకష్టాలకు గురవుతున్న ప్రజలను చూసిన కేశవరావు చలించిపోయాడు. దాన్నుంచి ప్రజలను విముక్తం చేయడానికి తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్]], [[కరీంనగర్ జిల్లా]]<nowiki/>ల్లో కేశవరావు కాలినడకన విస్తృతంగా పర్యటించాడు. ఆ క్రమంలోనే భారత స్వాతంత్య్రోద్యమం పట్ల, గాంధీ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యాడు.<ref>{{Cite web|url=http://www.teluguwishesh.com/animuthyalu/212-andhra-great-people-animutyalu/62462-sardar-jamalapuram-kesava-rao-biography-telangana-freedom-fighter-nizam-ruling.html|title=sardar jamalapuram kesava rao biography {{!}} Nizam Kingdom {{!}} Indian freedom fighters|website=www.teluguwishesh.com|last=Jagadeesh|access-date=2018-12-24}}</ref>
 
 
==స్వాతంత్ర్యోధ్యమంలో==
1923లో [[రాజమండ్రి]]<nowiki/>లో మొదటిసారి [[మహాత్మా గాంధీ|గాంధీ]] ఉపన్యాసాన్ని విన్న కేశవరావు, 1930లో [[విజయవాడ]]<nowiki/>లో జరిగిన సభలో గాంధీ పరిచయంతో మరింత ఉత్తేజితుడైనాడు. ఆంధ్రపితామహుడుగా ప్రఖ్యాతిగాంచిన [[మాడపాటి హనుమంతరావు]] ప్రారంభించిన [[గ్రంథాలయ ఉద్యమం|గ్రంథాలయోద్యమాన్ని]] [[తెలంగాణ]]<nowiki/>లోని ప్రతి పల్లెలోనూ ప్రచారం గావించాడు. వయోజన విద్యకై రాత్రి పాఠశాలలు నడపడంలో కేశవరావు ముందుండేవాడు. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రత్యేక శ్రద్ధను కనపరిచే వాడు. 'హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌' స్థాపనలో కేశవరావు కీలకపాత్ర వహించి, దానికి మొదటి అధ్యక్షుడయ్యాడు. 1938లో దీపావళి సందర్భంగా ఆవిర్భవించిన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్‌లో కేశవరావు ప్రముఖపాత్ర నిర్వహించారు. <ref name="jamalapuram"/> 1938 సెప్టెంబర్‌ 24 మధ్యాహ్నం మధిరలో గోవిందరావు నానక్, జనార్దనరావు దేశాయ్, [[రావి నారాయణరెడ్డి]]<nowiki/>లతో కలిసి సత్యాగ్రహ దీక్షకు కేశవరావు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో సర్దార్‌ను దీక్ష చేయనివ్వొద్దని నిజాం ప్రభుత్వం అనుమతినివ్వలేదు. మధిరలో అడుగడుగునా పోలీసులను మెహరించింది. అయినా భారీ సంఖ్యలో ప్రజలు దీక్ష వేదిక దగ్గరకు చేరుకున్నారు. అప్పుడే ఎవరూ ఉహించని విధంగా రైతు వేషంలో దీక్ష వేదిక దగ్గరకు వచ్చాడు కేశవరావు. వెంటనే మహాత్మాగాంధీకి జై, హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ జై అని దిక్కులు పెక్కటిల్లేలా నినాదించాడు. అరెస్టు చేసి నిషేధాన్ని ఉల్లఘించి సత్యగ్రహ దీక్ష చేశారంటూ కేశవరావుకు 18 నెలలు జైలు శిక్ష విధించారు. వరంగల్‌ జైలులో ఎనిమిది నెలల శిక్షను అనుభవించిన తర్వాత కేశవరావుతో సహా రాజకీయ ఖైదీలందరినీ నిజామాబాద్‌ జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా అదే పోరాటపంథాను కేశవరావు కొనసాగించారు. అంటరానితనం నిర్మూలించేందుకు ప్రయత్నం చేశారు. ఆదివాసీల అభివృద్ధికి కూడా ఉద్యమం చేశాడు. పానుగంటి పిచ్చయ్య, వనం నరసింహారావు, నారాయణరావులతో పాల్వంచలో పర్యటించి ఆదివాసీ మహాసభను ఏర్పాటు చేశారు. తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయాల స్థాపనను యజ్ఞంలా భావించాడు. అంతేకాక వయోజన విద్య కోసం రాత్రి బడులు నడిపారు. అణగారిన వర్గాల్లో చైతన్యం నిపండానికి ప్రత్యేక శ్రద్ధ చూపాడు.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/vedika/635521|title=తెలంగాణ వీరకేసరి సర్దార్‌ జమలాపురం కేశవరావు {{!}} వేదిక {{!}} www.NavaTelangana.com|website=www.navatelangana.com|access-date=2018-12-24}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/జమలాపురం_కేశవరావు" నుండి వెలికితీశారు