జమలాపురం కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==స్వాతంత్ర్యోధ్యమంలో==
1923లో [[రాజమండ్రి]]లో మొదటిసారి [[మహాత్మా గాంధీ|గాంధీ]] ఉపన్యాసాన్ని విన్న కేశవరావు, 1930లో [[విజయవాడ]]<nowiki/>లో జరిగిన సభలో గాంధీ పరిచయంతో మరింత ఉత్తేజితుడైనాడు. ఆంధ్రపితామహుడుగా [[మాడపాటి హనుమంతరావు]] ప్రారంభించిన [[గ్రంథాలయ ఉద్యమం]]ను [[తెలంగాణ]]<nowiki/>లోని ప్రతి పల్లెలోనూ ప్రచారం గావించాడు. వయోజన విద్యకై రాత్రి పాఠశాలలు నడపడంలో కేశవరావు ముందుండేవాడు. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రత్యేక శ్రద్ధను కనపరిచే వాడుకనపరిచేవాడు. 'హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌' స్థాపనలో కేశవరావు కీలకపాత్ర వహించి, దానికి మొదటి అధ్యక్షుడయ్యాడు. 1938లో దీపావళి సందర్భంగా ఆవిర్భవించిన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్‌లో కేశవరావు పాత్ర నిర్వహించారునిర్వహించాడు.<ref name="jamalapuram"/> 1938 సెప్టెంబర్‌ 24 మధ్యాహ్నం మధిరలో గోవిందరావు నానక్, జనార్దనరావు దేశాయ్, [[రావి నారాయణరెడ్డి]]<nowiki/>లతో కలిసి సత్యాగ్రహ దీక్షకు కేశవరావు సిద్ధమయ్యారుసిద్ధమయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో సర్దార్‌ను దీక్ష చేయనివ్వొద్దని నిజాం ప్రభుత్వం అనుమతినివ్వలేదు. మధిరలో అడుగడుగునా పోలీసులను మెహరించింది. అయినా భారీ సంఖ్యలో ప్రజలు దీక్ష వేదిక దగ్గరకు చేరుకున్నారు. అప్పుడే ఎవరూ ఉహించని విధంగా రైతు వేషంలో దీక్ష వేదిక దగ్గరకు వచ్చాడు కేశవరావు. వెంటనే మహాత్మాగాంధీకి జై, హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ జై అని దిక్కులు పెక్కటిల్లేలా నినాదించాడు. అరెస్టు చేసి నిషేధాన్ని ఉల్లఘించి సత్యగ్రహ దీక్ష చేశారంటూ కేశవరావుకు 18 నెలలు జైలు శిక్ష విధించారు. వరంగల్‌ జైలులో ఎనిమిది నెలల శిక్షను అనుభవించిన తర్వాత కేశవరావుతో సహా రాజకీయ ఖైదీలందరినీ నిజామాబాద్‌ జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా అదే పోరాటపంథాను కేశవరావు కొనసాగించారుకొనసాగించాడు. అంటరానితనం నిర్మూలించేందుకు ప్రయత్నం చేశారు. ఆదివాసీల అభివృద్ధికి కూడా ఉద్యమం చేశాడు. పానుగంటి పిచ్చయ్య, వనం నరసింహారావు, నారాయణరావులతో పాల్వంచలో పర్యటించి ఆదివాసీ మహాసభను ఏర్పాటు చేశారు. తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయాల స్థాపనను యజ్ఞంలా భావించాడు. అంతేకాక వయోజన విద్య కోసం రాత్రి బడులు నడిపారు. అణగారిన వర్గాల్లో చైతన్యం నిపండానికి ప్రత్యేక శ్రద్ధ చూపాడు.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/vedika/635521|title=తెలంగాణ వీరకేసరి సర్దార్‌ జమలాపురం కేశవరావు {{!}} వేదిక {{!}} www.NavaTelangana.com|website=www.navatelangana.com|access-date=2018-12-24}}</ref>
 
1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు ‘[[భారతదేశం విడిచిపో ఉద్యమం|క్విట్ ఇండియా]]’ ఉద్యమాన్ని తెలంగాణలో ఊరూరా ప్రచారం చేశాడు. 1946లో [[మెదక్ జిల్లా]] కందిలో కేశవరావు అధ్యక్షతన జరిగిన 13వ [[ఆంధ్ర మహాసభ|ఆంధ్రమహాసభ]] సందర్భంగా నిర్వహించిన బ్రహ్మాండమైన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. 1947 ఆగస్టు 7న [[మధిర]]<nowiki/>లో స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్ర హం మరువలేనిది. దానికి బాధ్యుడైన కేశవరావుకు ప్రభుత్వం రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించింది. యావత్ భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న సందర్భంలో కేశవరావు వంటి నాయకులు నిర్భంధానికి గురికావడం ఒక విషాదం. నిజాం సంస్థానం [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో విలీనమైన తరువాత, 1952లో కేశవరావు [[రాజ్యసభ]]<nowiki/>కు ఎన్నికయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/జమలాపురం_కేశవరావు" నుండి వెలికితీశారు