రవీంద్రనాథ్ ఠాగూర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
:'' '''గీతాంజలి''' పూర్తి అనువాదం వికిసోర్స్‌లో ఉన్నది. [[:s:గీతాంజలి|ఇక్కడ]] చూడండి''
 
[[భారత దేశం|భారత దేశానికి]] [[జాతీయ గీతం|జాతీయ గీతాన్ని]] అందించిన కవి, '''రవీంద్రనాథ్ ఠాగూర్''' (''Ravindranath Tagore'') ([[మే 7]], [[1861]] - [[ఆగస్టు 7]], [[1941]]). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన '''[[గీతాంజలి కావ్యం|గీతాంజలి]]''' కావ్యానికి సాహిత్యంలో [[నోబెల్ బహుమతి]]ని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.
 
== బాల్యము, విద్యాభ్యాసము ==
పంక్తి 26:
రవీంద్రుడు [[ఇంగ్లాండు]]లో ఒక పబ్లిక్ స్కూలులో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పొంచుకొన్నాడు. సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్లి, ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలు బాగా ఆకళించుకొన్నాడు. తన అనుభవాలను భారతికి లేఖలుగా వ్రాసేవాడు. రవీంద్రుడు ఇంగ్లండులో వుండగానే ''భగ్న హృదయం'' అనే కావ్యాన్ని రచించాడు. అయితే ఇంగ్లండులో పద్దెనిమిది మాసాలు వుండి ఏ డిగ్రీనీ సంపాదించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు.ఆ తర్వాత '''1883 డిసెంబరు 9''' న '''మృ ణాలిని దేవీ'''ని వివాహమాడెను.
 
=== సాహితీవ్యాసంగం ===
రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. ఆయన రచించిన ''సంధ్యాగీత్'' కావ్యాన్ని కవులందరూ మెచ్చుకొనేవారు. [[వందేమాతరం]] గీతాన్ని రచించిన [[బంకించంద్ర ఛటర్జీ]] కూడా రవీంద్రుని ప్రశంసించాడు. రవీంద్రుడు రచించిన భక్తిగీతాలను తండ్రి విని, వాటి ప్రచురణ కవసరమయిన డబ్బు ఇచ్చేవాడు. ఆ తరువాత రవీంద్రుడు ''విర్గరేర్ స్వప్న భంగ'', '''sangeetha prabhata'' అనే కావ్యాలను రచించాడు. Rabindranath Tagore....''
 
== గీతాంజలి ==
పంక్తి 38:
 
== నవల,నాటకాలు ==
గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని రవీంద్రుడు భావించాడు. అందుకై శ్రీ నికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేసేవాడు. రవీంద్రుడు మొదట ''వాల్మీకి ప్రతిభ'' అనే నాటకాన్ని రచించాడు. ఆ తరువాత అమల్ అనే పిల్లవాణ్ణి గురించి ''పోస్టాఫీసు'' అనే నాటకం వ్రాశాడు. రవీంద్రుడు రచించిన చిత్రాంగద నాటకం ఆయనకు మంచిపేరు తెచ్చింది. ''ప్రకృతి - ప్రతీక'' అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించాడు. రవీంద్రుడు కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్‌పూజ మొదలగు అనేక శ్రేష్టమయిన నాటకాలు రచించాడు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలసి మెలసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం, ఉత్తమ సందేశం మిళితమైన '"గోరా'" నవల రవీంద్రునికెంతో పేరు తెచ్చింది.
 
== చిత్రకళ, సంగీతం ==
పంక్తి 46:
 
== స్వాతంత్ర్య సాధన,జనగణమణ ==
రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. [[పృథ్వీరాజు]] పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించాడు. బ్రిటీష్ ప్రభుత్వం [[బాలగంగాధర తిలక్|తిలక్‌]]ను నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. [[బెంగాల్ విభజన]] ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖపాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. రవీంద్రనాథ టాగోర్ [[1896]]లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన '''వందేమాతరాన్ని''' ఆలపించాడు. రవీంద్రుడు వ్రాసిన "'''' జనగణమణ ''''" ను జాతీయ గీతంగా ప్రకటించేముందు "వందేమాతరం", "జనగణమన" లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి '"'''జనగణమన''''" దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|బాబూ రాజేంద్ర ప్రసాద్]] [[1950]] [[జనవరి 24]]న ''[[జనగణమన]]''ను జాతీయ గీతంగా ''[[వందేమాతరం]]''ను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేసాడు.
 
== రచనలనుండి ఉదాహరణలు ==
గీతాంజలి రవీంద్రునికి కవిగా ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ కావ్యంలోని ఈ కింది గీతం మహాత్మాగాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది.
 
ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టు తలుపులన్నింటినీ బంధించి ఈ చీకటిగదిలో ఎవరిని పూజిస్తున్నావు? కళ్ళు తెరచి చూడు. నీవు ఆరాధించే దేవుడు నీ ఎదుట లేడు! ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో, ఎచ్చట శ్రామికుడు రాళ్ళు పగులగొట్టుతున్నాడో,అక్కడ ఆ పరమాత్ముడున్నాడు.వారితో ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములలో ఉన్నాడు. నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి ఆనేల మీదికి పదా.....
 
;విస్తృతంగా జనప్రియమైన మరొక రచన. ఇది చాలా పాఠ్యపుస్తకాలలో ఒక పాఠంగా చేర్చబడుతుంది.
 
;''Where the mind is without fear''
 
''Where the mind is without fear and the head is held high;''
 
''Where knowledge is free;''
 
''Where the world has not been broken up into fragments by narrow domestic walls;''
 
''Where words come out from the depth of truth;''
 
''Where tireless striving stretches its arms towards perfection;''
 
''Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;''
 
''Where the mind is led forward by thee into ever-widening thought and action—Into that heaven of freedom, my Father, let my country awake''.
 
;దీనికి తెలుగు అనువాదం
పంక్తి 93:
 
== క్లుప్తంగా సమాచారం ==
* జననం: 1861 మే 7.
* తండ్రి మహర్షి దేవేంద్రనాథ టాగూరు, తల్లి శారదాదేవి.
* 15 మంది సంతతిలో పధ్నాలుగో బిడ్డ, ఎనిమిదవ పుత్రుడు .
* రచనారంభం: 1873.
* ప్రథమ పద్య కావ్య ప్రచురణ: 1878.
* మృణాళినీదేవి తోవివాహం: 1883.
* మృణాళినీదేవి మరణం: 1902.
* శాంతినికేతన్‌ స్థాపన: 1901 డిసెంబరు.
* ''గీతాంజలి''కి [[నోబెల్ బహుమతి]]: 1913 నవంబరు.
* విశ్వభారతి స్థాపన: 1921 డిసెంబరు.
* మరణం: 1941, ఆగస్టు 7.
* ఆత్మకథ : మై రెమినిసెన్సెస్
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రవీంద్రనాథ్_ఠాగూర్" నుండి వెలికితీశారు