పురిపండా అప్పలస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పురిపండా అప్పలస్వామి బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయులు.
 
వీరు [[విజయనగరం]] జిల్లా, [[సాలూరు]] గ్రామంలో [[నవంబరు 13]], [[1904]] సంవత్సరంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొంతకాలం జరిపి, పిదప స్వయంకృషి వలన ఆంధ్ర, సంస్కృతాలలోనే గాక ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో సమధిక పాండిత్యాన్ని ఆర్జించారు. వీరు [[మహత్మాగాంధీ]] నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం, హరిజనోద్యమం మరియు ఖాదీ ప్రచారము లలో అత్యంత శ్రద్ధతో పాల్గొన్నారు. విశాఖపట్నంలో అఖిల భారత చరఖా సంఘం వారి ఖాదీ భాండాగారంలో నిర్వహకుడుగా కొంతకాలం పనిచేశారు.
వీరు [[విజయనగరం]] జిల్లా, [[సాలూరు]] గ్రామంలో [[నవంబరు 13]], [[1904]] సంవత్సరంలో జన్మించారు.
 
పత్రికా రంగంలో వీరు తన ప్రతిభను ప్రదర్శించారు. విశాఖపట్నం నుండి వెలువడిన '[[స్వశక్తి]]' అను జాతీయ వారపత్రికకు సహాయ సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు. '[[ఆంధ్రపత్రిక]]' కు స్వకీయ విలేఖరిగా పన్నెండేళ్ళు వ్యవహరించారు. '[[సత్యవాణి]]' పత్రికను నిర్వహించుచు ఆయన రాసిన సంపాదక వ్యాసాలు పునర్ముద్రణ గౌరవాన్ని పొందాయి.
 
==రచనలు==