షారుఖ్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

Blanked the page
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''షారుఖ్ ఖాన్''' (జననం [[2 నవంబర్|2 నవంబరు]] [[1965]])  ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత టివీ ప్రముఖుడు. అభిమానులు ఆయనను బాద్షా ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఖాన్ అని పిలుస్తారు. షారూఖ్ దాదాపు 80 సినిమాల్లో నటించారు. ఆయన 14 [[ఫిలింఫేర్|ఫిలింఫేర్ పురస్కారాల]]ు అందుకున్నారు. [[ఆసియా]]లో షారూఖ్ చాలా ప్రముఖుడైన నటుడు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువ నివసించే ప్రదేశాల్లో కూడా ఆయన చాలా ప్రసిద్ధుడు. అభిమానుల సంఖ్య, వసూళ్ళు లెక్కలో షారూఖ్ ప్రపంచంలోని అత్యంత సక్సెస్ ఫుల్ ఫిలిం స్టార్ లలో ఒకరిగా  నిలిచారు.<ref name="billion" /><ref name="Richest Actors" /><ref name="thetimes1" />
 
1980వ దశకం చివర్లో టివి సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించారు షారూఖ్. 1992లో దీవానా సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు ఆయన. కెరీర్ మొదట్లో దార్ర్ (1993), [[బాజిగర్]] (1993),  అంజామ్ (1994) వంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించారు. ఆ తరువాత వచ్చిన రొమాంటిక్  కామెడీ సినిమాలు [[దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే]] (1995), దిల్ తో పాగల్ హై (1997), కుచ్ కుచ్ హోతా హై (1998), మొహొబ్బతే (2000), [[కభీ ఖుషీ కభీ గమ్]] (2001) సినిమాలతో హీరోగా ఉన్నత శిఖరాలందుకున్నారు షారుఖ్. దేవదాస్ (2002), స్వదేశ్ (2004), చక్ దే! ఇండియా (2007), మై నేమ్ ఈజ్ ఖాన్ (2010) సినిమాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆయన నటించిన కామెడీ సినిమాలు [[చెన్నై ఎక్స్‌ప్రెస్]] (2013), హ్యాపీ న్యూ ఇయర్ (2014) సినిమాలో అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఆయన సినిమాల్లో దేశభక్తి, సామాజిక సమస్యల గురించి ఎక్కువగా చర్తిస్తారు. సినిమాల్లో చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతోనూ,  ఫ్రాన్స్ ప్రభుత్వం ఒర్డరే డెస్ ఆర్ట్స్ ఎట్ దెస్ లెట్టర్స్, లెగియన్ డి ' హానర్ పురస్కారలతో గౌరవించాయి.
 
ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ కు ఆయన సహ చైర్మన్ గానూ, [[ఇండియన్ ప్రీమియర్ లీగ్]] లోని [[కోల్‌కత నైట్ రైడర్స్]] టీంకు సహ యజమానిగా ఉన్నారు. ఆయన ఇప్పటికీ టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. ఎన్నో వ్యవస్థాపక వెంచర్లు చేస్తున్నందున మీడియా ఆయనను "బ్రాండ్ ఎస్.ఆర్.కె"గా వ్యవహరిస్తుంటుంది. అనారోగ్యాల అవగాహన ప్రచారంలోనూ, విపత్తులు సంభవించినప్పుడు ఆయన దాతృత్వం చెప్పుకోదగ్గది. పిల్లల చదువు ఆవశ్యకతా ప్రచారంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2011లో  యునెస్కో పిరమిడ్ కాచ్ మర్నీ పురస్కారంతో గౌరవించింది.  ప్రభావవంతమైన భారతీయునిగా ఎన్నో పత్రికల చిట్టాల్లో ఎన్నోసార్లు ఉన్నారు షారుఖ్. 2008లో న్యూస్ వీక్ పత్రిక ప్రపంచంలోని 50 అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల జాబితాలో ఆయనను ప్రస్తావించింది.
 
== తొలినాళ్ళ జీవితం, కుటుంబం ==
[[దస్త్రం:Shahrukh_Khan_and_Gauri_at_'The_Outsider'_launch_party.jpg|alt=Shah Rukh Khan standing beside his wife Gauri at a party in 2012|కుడి|thumb|2012లోని ఒక పార్టీలో భార్య గౌరి ఖాన్ తో షారుఖ్]]
2 నవంబరు 1965లో [[ఢిల్లీ]] లో ముస్లిం కుటుంబంలో జన్మించారు  ఆయన. పుట్టిన తరువాత 5ఏళ్ళ వరకు ఆయన [[మంగళూరు]] లోని  అమ్మమ్మ గారింట్లో ఉండేవారు షారూఖ్.<ref>{{Cite web|url=http://www.ibtimes.co.in/shah-rukh-khan039s-south-connect-039chennai-express039-actor039s-mangalore-home-turns-into-tourist-spot-501269|title=Shah Rukh Khan's South Connect: 'Chennai Express' Actor's Mangalore Home Turns into Tourist Spot|date=25 August 2013|accessdate=23 September 2013|archiveurl=http://www.webcitation.org/6X67XCRE6|archivedate=17 March 2015|work=[[International Business Times]]}}</ref><ref name="BornBroughtup">{{Cite news|url=http://photogallery.indiatimes.com/celebs/bollywood/shah-rukh-khan/bday-special-shah-rukh-khan/articleshow/25059441.cms|title=B'day Special: Shah Rukh Khan (p. 4)|work=The Times of India|accessdate=16 November 2014|archiveurl=https://web.archive.org/web/20141216104040/http://photogallery.indiatimes.com/celebs/bollywood/shah-rukh-khan/bday-special-shah-rukh-khan/articleshow/25059441.cms|archivedate=16 December 2014|deadurl=no}}</ref> షారూఖ్ తాత ఇఫ్తికర్ అహ్మద్ 1960ల్లో పోర్టులో చీఫ్ ఇంజినీరుగా పనిచేసేవారు. తన నాన్నగారి తండ్రి జాన్ మహ్మద్ [[ఆఫ్ఘనిస్థాన్]]కు చెందిన సంప్రదాయ పఠాన్ కుటుంబానికి చెందినవారని  షారూఖ్ చెబుతారు.<ref>{{Cite AV media|title=Mardomi interviews Shahrukh Khan in U.S.A|url=https://www.youtube.com/watch?v=Hwbta8t2XH4&t=2m00s|date=26 January 2009|publisher=[[YouTube]]|time=2:00|accessdate=1 November 2014}}</ref> ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో తమది పెషావర్ కు చెందిన పఠాన్ కుటుంబమనీ, తాము ఇంట్లో హింద్కో భాషలోనే మాట్లాడుకుంటామనీ వివరించారు.<ref>{{Cite AV media|title=Shahrukh Khan Show on StarPlus|url=https://www.youtube.com/watch?v=SEUmKkCrsUo&feature=youtu.be&t=55|date=2009|publisher=[[YouTube]]|time=0:55|accessdate=7 February 2016}}</ref> బ్రిటిష్ భారత్ లోని పెషావర్ లో షారొఖ్ తండ్రి మీర్ తాజ్ మొహమద్ ఖాన్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కు అనుచరుడు, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. [[భారత విభజన]] తరువాత వారి కుటుంబం  [[ఢిల్లీ]] కి వచ్చేశారు.<ref>{{Cite web|url=http://specials.rediff.com/news/2004/may/31sl02.htm|title=Peshawar: The Shah Rukh Connection|date=31 May 2004|accessdate=28 January 2013|publisher=[[Rediff.com]]|author=Shariff, Faisal}}</ref> షారూఖ్ తల్లిదండ్రులు 1959లో వివాహం చేసుకున్నారు. ఒక ట్వీట్  లో  షారూఖ్ తనను హాఫ్ హైదరాబాదీ (తల్లి), హాఫ్ పఠాన్ (తండ్రి), హాఫ్ కాశ్మీరీ (నానమ్మ) గా పేర్కొన్నారు.<ref>{{Cite news|url=https://twitter.com/iamsrk/status/21639346475|title=Shah Rukh Khan on Twitter, @iamsrk|date=19 August 2010|publisher=[[Twitter]]|accessdate=27 July 2014|quote=i am half hyderabadi (mom) half pathan (Dad) some kashmiri (grandmom) born in delhi life in mumbai punjabi wife kolkata team. indian at heart}}</ref>
 
=== సినిమాలు ===
పూర్తి వ్యాసం [[షారూఖ్ ఖాన్ సినిమాలు]]
== అవార్డులు, గౌరవాలు ==
* [[ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు - 2018]]లో క్రిస్టల్ అవార్డు అందుకున్నాడు.
 
== ఫుట్ నోట్స్ ==
{{Notelist}}
 
== మూలాలు ==
{{Reflist|25em}}
 
{{Authority control}}
 
[[వర్గం:1965 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన]]
[[వర్గం:గూగుల్ అనువాద వ్యాసాల అభివృద్ధి ప్రాజెక్టు]]
"https://te.wikipedia.org/wiki/షారుఖ్_ఖాన్" నుండి వెలికితీశారు