మకర సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి "వనపర్తి జిల్లా గ్రామాలు" వర్గాన్ని తొలగించాను., typos fixed: ె → ే (2), దాన్య → ధాన్య (2), బందువులు →
పంక్తి 26:
[[సంక్రాంతి]] లేదా '''సంక్రమణము''' అంటే మారడం అని అర్థం. [[సూర్యుడు]] మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం [[సంక్రాంతి]]. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా [[పుష్యమాసము|పుష్యమాసం]]<nowiki/>లో, [[హేమంత ఋతువు]]<nowiki/>లో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే '''మకర సంక్రాంతి'''కి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది [[జనవరి]] మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే [[జనవరి 15]] తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.
 
ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( [[భోగి]], [[మకర సంక్రమణం]], [[కనుమ]]) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు [[ముక్కనుమ]] ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో [[రైతులు]] ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి [[రైతులు|రైతుల]] పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో [[ఉత్తరాయణం]] మొదలవుతుంది.
 
నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా [[తెలుగు]]నాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. [బుడబుక్కలవాళ్లు], [[పగటివేషధారులు]], రకరకాల జానపద వినోద [[కళాకారులు]] తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను [[రంగవల్లులు]], [[గొబ్బెమ్మ]] లతో అలంకరిస్తారు. [[ముగ్గులు]] వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద [[ధాన్యము|ధాన్యం]] బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు [[భోగిమంట]] విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు [[కొత్త అల్లుడు]] తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. [[కుక్కుట శాస్త్రం|కోడి పందాలు]], ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.
పంక్తి 46:
ఇది సాధారణంగా [[జనవరి 14]]న జరుపుతారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి [[భోగి మంటలు]] వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే [[చలి]] పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత [[చీపురు|చీపుర్లూ]], [[తట్ట]]లూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున [[భోగి మంటలు]] వెలిగిస్తారు.
 
సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు [[బొమ్మల కొలువు]]ను ఏర్పాటు చేస్తారు.దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది [[భోగి]] పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులుబంధువులు సమావేశమై, [[రేగు|రేగిపళ్ళు]], [[శనగలు]],[[పూలు]], [[చెరుకు]]గడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి [[దిష్టి]] తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి [[తాంబూలం|తాంబూలాలతో]] పాటు [[పట్టు]]బట్టలు, [[పసుపు]], [[కుంకుమ]]లు పెట్టడం ఆనవాయితీ.
 
== సంక్రాంతి ==
పంక్తి 53:
[[File:Festival of Makar Sankranti.jpg|thumb|సంక్రాంతి రోజున గ్రామోత్సవానికి విచ్చేసిన స్వామివారు]]
రెండవ రోజయిన సంక్రాంతి రోజున [[పాలు]] పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో [[అరిసెలు]], [[బొబ్బట్లు]], [[జంతికలు]],[[చక్కినాలు]], [[పాలతాలుకలు]], సేమియాపాయసం, [[పరమాన్నం]], [[పులిహోర]], [[గారెలు]] మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.
సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, [[డోలు]], [[సన్నాయి]] రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ [[గంగిరెద్దులాటలు|గంగిరెద్దులు]] మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. ''అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు'' అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త దాన్యముధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి దాన్యమ్ధాన్యమ్ ఇస్తాము. ''హరిలో రంగ హరీ'' అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ [[కోడిగుడ్డు]] లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా [[హరిదాసు]] ప్రత్యక్షమవుతాడు.
 
== కనుమ ==
పంక్తి 72:
 
;గొబ్బెమ్మలు
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే [[గొబ్బెమ్మలు]] కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, [[పసుపు]] [[కుంకుమ]]లు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. [[సంక్రాంతి]] రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందెసందే గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.
 
;భోగిమం
పంక్తి 95:
'''గాలిపటాలు'''
 
[[సంక్రంతి]] పండుగ పిల్లలందరికి చాలా ప్రథ్యెకమైన పందుగ, అది ఎంధు వలననగ పిల్లలు అరజు పొద్దిన నుది సాయంత్రం దాకా గాలి'''పటాల'''తొనెతొనే గడుపుతారు.
 
== కొన్ని విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/మకర_సంక్రాంతి" నుండి వెలికితీశారు