వెంగమాంబ పేరంటాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కార్యక్రమాల వివరాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
బ్రహ్మోత్సవాలు ఏటా జ్యేష్ఠమాసం [[పౌర్ణమి]] గడిచిన తదుపరి [[ఆదివారం]] నుండి [[గురువారం]] వరకు ఐదురోజులపాటు కన్నులపండువగా నిర్వహించెదరు.
==కార్యక్రమాల వివరాలు==
#వెంగమాంబ పచ్చవ కమ్మవారి వంశంలో జనించిన వీరనారి. ఆదివారం నాడు నిలుపు కార్యక్రమంలో, [[వడ్డిపాళెం]]<nowiki/>లోని వెంగమాంబ [[పుట్టినిల్లు - మెట్టినిల్లు|పుట్టినిల్లు]] అయిన "పచ్చవ" వారి నివాసంలో, ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా అక్కడి [[దేవాలయం]]<nowiki/>లో, వెంగమాంబ పేరంటాలు ఆడబడుచులు, వంశస్థులు, భక్తులు, కుటుంబసమేతంగా పసుపుదంచే కార్యక్రమంలో పాల్గొంటారు. అంతకుముందు దేవర ఇంటిలో ఏర్పాటుచేసిన, శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ వెంగమాంబకు మహిళలు ప్రత్యేకపూజలు చేసెదరు. పసుపు దంచిన అనంతరం, పసుపు, కుంకుమలను ఊరేగింపుగా వెంగమాంబ పేరంటాలను దేవస్థానం వరకు తీసుకొనివచ్చి, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఆ రోజున సంతానం లేని మహిళలు అమ్మవారి ముందు వరపడెదరు.
#సోమవారం నాడు, గ్రామోత్సవం:- వడ్డిపళెంలో వెంగమాంబ పేరంటాలు పుట్టినింటినుండి ప్రారంభమైన గ్రామోత్సవం, స్నేహితురాలు తుమ్మల పెదవెంగమ్మ, అత్తమామల ఇళ్ళమీదుగా, నర్రవాడ, గుదివారిపాలెం, ఉలవావారిపాలెం మీదుగా దేవస్థానానికి చేరుకొనును. గ్రామోత్సవంలో భాగంగా వెంగమాంబ దంపతులను ప్రత్యేకంగా అలంకరించి వాహనంలో ఊరేగించెదరు. శ్రీ వెంగమాంబ పేరంటాలు భర్త గురవయ్యనాయుడుతోపాటు, ఉత్సవమూర్తిగా రథంపై కూర్చొని భక్తులకు దర్శనమిచ్చెదరు. దారి వెంబడి ప్రతి ఇంటివద్ద, వెంగమాంబ అమ్మవారికి భక్తులు పూజలు చేసెదరు. ప్రతి ఇంటివద్ద భక్తులు, కాయా కర్పూరం సమర్పించి, ఆపద మొక్కులతల్లీ, మా కోర్కెలు తీర్చు తల్లీ, అంటూ మొక్కుకొనెదరు. బైనేడీలవాయిద్యాల మధ్య గ్రామోత్సవం వైభవంగా నిర్వహించెదరు. సంతానంలేని మహిళలు, అమ్మవారి ముందు వరపడితే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాడవిశ్వాసం. ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం, వందలాది మండి మహిళలు అమ్మవారివద్ద వరపడటం ఆనవాయితీగా వస్తున్నది. మహిళలు తలస్నానాలు చేసి తడిబట్టలతో వెంగమాంబను వేడుకొనెదరు. ఆదివారం రాత్రి నిలుపు కార్యక్రమంలో పాల్గొని [[సంతానం (అయోమయ నివృత్తి)|సంతానం]] కోసం వరపడిన మహిళలు, సోమవారం ఉపవాసం ఉండి, మళ్ళీ అమ్మవారి వద్ద వరపడెదరు.
#మంగళవారం నాడు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంగమాంబ పేరంటాలు, ప్రత్యేక వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చెదరు. గ్రామవీధులలో ఊరేగిన అమ్మవారికి, భక్తులు, కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకొనెదరు.
"https://te.wikipedia.org/wiki/వెంగమాంబ_పేరంటాలు" నుండి వెలికితీశారు