విజయశాంతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 45:
 
=== 1991 నుండి 1995 ===
[[కర్తవ్యం]] తెచ్చి పెట్టిన సూపర్ స్టార్ హోదా వల్ల 1991 నుండి విజయశాంతి నటించే చిత్రాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆమెను ఆట పాటలకు మాత్రమే పరిమితమైన కథానాయిక పాత్రలో చూడటానికి ప్రేక్షకులు అయిష్టత చూపించసాగారు. ఆమె ఉందంటే ఆ పాత్రకు ఏదో ప్రత్యేకత ఉండి తీరుతుందన్న నమ్మకంతో సినిమాకు వచ్చే ప్రేక్షక గణం పెరిగిపోయింది. ఆ కారణంగా దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసమే కథలు తయారు చేసి [[సినిమాలు]] తీయడం మొదలు పెట్టారు. ఆ ఒరవడిలో వచ్చినవే [[మొండి మొగుడు - పెంకి పెళ్లాం]], [[ఆశయం]], [[మగరాయుడు]], [[పోలీస్ లాకప్]], [[లేడీ బాస్]], [[స్ట్ర్రీట్ ఫైటర్]], [[అత్తా కోడళ్లు]] తదితర చిత్రాలు. శతదినోత్సవాల సంగతి అవతల పెడితే ఇవన్నీ ఎంతో కొంత లాభాలార్జించినవే. ఇవే కాక 1991 - 1995 మధ్య కాలంలో ఆమె ఇతర ప్రముఖస్టార్ హీరోల సరసన ప్రాధాన్యత గల పాత్రల్లో నటించగా విజయం సాధించిన చిత్రాలు [[సూర్య ఐ.పి.ఎస్.]], [[లారీ డ్రైవర్]], [[గ్యాంగ్ లీడర్]], [[రౌడీ ఇన్స్ పెక్టర్]], [[మెకానిక్ అల్లుడు]] మరియు [[చినరాయుడు]]. మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలందుకున్నా బాక్సాఫీసు వద్ద చతికిలబడిన [[జైత్ర యాత్ర]] కూడా ఈ కాలంలో వచ్చిందే.
 
ఈ కాలంలోనే [[కర్తవ్యం]] చిత్రాన్ని [[తేజస్విని]] పేరుతో [[హిందీ సినిమా రంగం|హిందీ]]<nowiki/>లో స్వయంగా పునర్నిర్మాణం చేసి తెలుగులో తను పోషించిన '''వైజయంతి''' పాత్రను '''తేజస్విని'''గా తిరిగి తనే పోషించింది. [[ఎన్. చంద్ర]] దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1994లో విడుదలై ఉత్తరాదిన మంచి విజయాన్ని చేజిక్కుంచుకుంది.
పంక్తి 51:
1992 లో ఆమె నటించిన [[తమిళ సినిమా|తమిళ]] చిత్రం [[మన్నన్]] మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఆమె నటించిన తొలి తమిళ చిత్రం అది. అందులో సూపర్ స్టార్ [[రజనీకాంత్]]కు పోటీగా అహంకారపూరితమైన కథానాయిక పాత్రలో ఆమె జీవించి తమిళ తంబిలచే ప్రశంషలూ అందుకుంది. (ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో [[చిరంజీవి]] నాయకుడిగా [[ఘరానా మొగుడు]]గా తెరకెక్కింది). ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఆమె రజనీకాంత్ ను చెంపదెబ్బ కొట్టవలసి వస్తుంది. తమిళనాట రజనికాంత్ కున్న వీరాభిమానుల సంగతి అందరికీ ఎరుకే. సినిమాలో రజనీకాంత్ పాత్రను వేరే పాత్ర తిట్టినా సహించకుండా చెప్పులు విసిరేసే రకం వాళ్లు. 'మరే ఇతర నటి ఆ పనిచేసినా నా అభిమానులు తెరలు చించేసి ఉండేవారు. విజయశాంతి కాబట్టి వాళ్లు ఊరుకున్నారు' అని ఆ సినిమా శతదినోత్సవ సభలో రజనీకాంత్ పేర్కొన్నారు.
 
1993 లో విజయశాంతి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ ఏడాది నవంబరులో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు చిత్ర రంగంలోని అనేక మంది ఇతర ప్రముఖులతోస్టార్ నటులతో పాటు అదృష్టవశాత్తూ తప్పించికుని బయటపడింది.
 
=== 1996 నుండి 2000 ===
"https://te.wikipedia.org/wiki/విజయశాంతి" నుండి వెలికితీశారు