సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఏస్టెరాయిడ్ సమూహాలు: +బాహ్య సౌర వ్యవస్థ
పంక్తి 86:
 
: అంతర సౌర వ్యవస్థలో భూ సమీప ఏస్టెరాయిడ్లు కూడా ఉన్నాయి. వీటిలో చాలా ఏస్టెరాయిడ్లు అంతర గ్రహాల కక్ష్యలను దాటుతూంటాయి.<ref name="MorbidelliAstIII">{{Cite book|url=http://www.boulder.swri.edu/~bottke/Reprints/Morbidelli-etal_2002_AstIII_NEOs.pdf|title=Origin and Evolution of Near-Earth Objects|journal=Asteroids III|editor=W.F. Bottke Jr.|editor2=A. Cellino|editor3=P. Paolicchi|editor4=R.P. Binzel|pages=409–422|date=January 2002|format=PDF|bibcode=2002aste.book..409M|first1=A.|last1=Morbidelli|last2=Bottke|first2=W.F.|last3=Froeschlé|first3=Ch.|last4=Michel|first4=P.}}</ref> వీటిలో కొన్ని ప్రమాదకరమైనవి కూడా.
:
 
== బాహ్య సౌర వ్యవస్థ ==
బాహ్య సౌర వ్యవస్థలో పెద్ద గ్రహాలకు వాటి ఉపగ్రహాలకూ నిలయం. సెంటార్లు, స్వల్ప కాలిక తోకచుక్కలు కూడా ఈ ప్రాంతంలో భ్రమిస్తూంటాయి. సూర్యుడి నుండి చాలా దూరంలో ఉండటాన, ఈ ప్రాంతంలోని ఘనపదార్థంతో కూడుకుని ఉన్న వస్తువుల్లో నీరు, అమ్మోనియా, మీథేన్ వంటి పదార్థాలు అంతర వ్యవస్థలోని వస్తువుల్లో కంటే ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం చేత ఈ పదార్థాలు ఘన స్థితిలో ఉంటాయి.
 
=== బాహ్య గ్రహాలు ===
[[File:Size_planets_comparison.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Size_planets_comparison.jpg|thumb|The outer planets (in the background) [./https://en.wikipedia.org/wiki/Jupiter Jupiter], [./https://en.wikipedia.org/wiki/Saturn Saturn], [./https://en.wikipedia.org/wiki/Uranus Uranus] and [./https://en.wikipedia.org/wiki/Neptune Neptune], compared to the inner planets [./https://en.wikipedia.org/wiki/Earth Earth], [./https://en.wikipedia.org/wiki/Venus Venus], [./https://en.wikipedia.org/wiki/Mars Mars] and [./https://en.wikipedia.org/wiki/Mercury_(planet) Mercury] (in the foreground).]]
[[File:Solar_system_orrery_outer_planets.png|link=https://en.wikipedia.org/wiki/File:Solar_system_orrery_outer_planets.png|thumb|[./https://en.wikipedia.org/wiki/Orrery Orrery] showing the motions of the outer four planets. The small spheres represent the position of each planet on every 100 [./https://en.wikipedia.org/wiki/Julian_day Julian days], beginning January 21 2023 (Jovian perihelion) and ending December 2 2034 (Jovian perihelion).]]
బాహ్య వ్యవస్థలో ఉన్న నాలుగు గ్రహాలను పెద్ద గ్రహాలు అంటారు. జోవియన్ గ్రహాలు అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న అన్ని వస్తువుల మొత్తం ద్రవ్యరాశిలో 99% ఈ నాలుగు గ్రహాలదే. గురుడు, శని గ్రహాల మొత్తం ద్రవ్యరాశి భూమి కంటే 400 రెట్లు ఉంది. హైడ్రోజన్, హీలియమ్ వీటిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. యురేనస్, నెప్ట్యూన్‌లు కొద్దిగా చిన్నవి{{mdash}}ఒక్కొక్కటీ భూమికి 20 రెట్లుంటుంది. వీటినిండా మంచే ఉంది. ఈ కారణాన కొందరు శాస్త్రవేత్తలు వీటిని పెద్ద మంచు గ్రహాలు (ఐస్ జెయింట్స్) అంటారు.<ref>{{cite web|title=Formation of Giant Planets|author1=Jack J. Lissauer|author2=David J. Stevenson|work=NASA Ames Research Center; California Institute of Technology|date=2006|url=http://www.gps.caltech.edu/uploads/File/People/djs/lissauer&stevenson(PPV).pdf|format=PDF|accessdate=16 January 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090326060004/http://www.gps.caltech.edu/uploads/File/People/djs/lissauer%26stevenson%28PPV%29.pdf|archivedate=26 March 2009}}</ref> ఈ నాలుగు గ్రహాలకూ వలయాలున్నాయి. అయితే శనికి ఉన్న వలయాలు మాత్రమే భూమి నుండి తేలిగ్గా కనిపిస్తాయి. ఊర్ధ్వ గ్రహాలు (సుపీరియర్ ప్లానెట్స్) అనే మాట భూ కక్ష్యకు ఆవల ఉన్న గ్రహాలన్నిటినీ అంటారు. అంటే ఈ వర్గీకరణలో ఈ నాలుగు గ్రహాలతో పాటు అంగారకుడు కూడా ఉంటుంది.
 
==== గురుడు ====
{{main|గురుడు}}
 
: గురు గ్రహం (సూర్యుడి నుండి 5.2&nbsp;AU) ద్రవ్యరాశి at {{earth mass|318}}, మిగతా అన్ని గ్రహాల మొత్తం ద్రవ్యరాశి కంటే 2.5 రెట్లు ఉంటుంది. ఇది హైడ్రోజన్, హీలియమ్‌లతో క్జూడుకుని ఉంటుంది. గురుడి లోని అంతర్గత ఉష్ణం దాని వాతావరణంలో మేఘాల పట్టీలు, దానిలో ఉన్న పెద్ద ఎర్రటి చుక్క వంటి అర్ధ శాశ్వత లక్షణాలను కలుగజేస్తుంది. మానవునికి తెలిసినంతలో గురు గ్రహానికి 79 ఉపగ్రహాలున్నాయి. గానిమీడ్, కాలిస్టో, అయో, యూరోపా అనేవి వీటిలో అతి పెద్దవి. రాతిగ్రహాల్లో లాగా వీటిలో అగ్నిపర్వతాలు, అంతర్గత తాపం వంటి లక్షణాలు ఈ నాలుగిట్లోనూ ఉన్నాయి.<ref>{{cite web|title=Geology of the Icy Galilean Satellites: A Framework for Compositional Studies|author=Pappalardo, R T|work=Brown University|date=1999|url=http://www.agu.org/cgi-bin/SFgate/SFgate?&listenv=table&multiple=1&range=1&directget=1&application=fm99&database=%2Fdata%2Fepubs%2Fwais%2Findexes%2Ffm99%2Ffm99&maxhits=200&=%22P11C-10%22|accessdate=16 January 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20070930165551/http://www.agu.org/cgi-bin/SFgate/SFgate?&listenv=table&multiple=1&range=1&directget=1&application=fm99&database=%2Fdata%2Fepubs%2Fwais%2Findexes%2Ffm99%2Ffm99&maxhits=200&=%22P11C-10%22|archivedate=30 September 2007|df=}}</ref> గానిమీడ్ సౌర వ్యవస్థలోని ఉపగ్రహాల్లోకెల్లా పెద్దది. ఇది బుధ గ్రహం కంటే కూడా పెద్దది.
 
==== శని ====
{{main|శని గ్రహం}}
 
: వలయాల వ్యవస్థ శని (సూర్యుడి నుండి 9.5&nbsp;AU) పత్యేకత. గురుడితో దీనికి వాతవరణ సమ్మేళనం, అయస్కాంతావరణం వంటి అనేక పోలికలున్నాయి. పరిమాణంలో ఇది గురు గ్రహంలో 60% ఉన్నప్పటికీ, ద్రవ్యరాశి - {{earth mass|95}} - గురుడిలో మూడోవంతు కంటే తక్కువ ఉంటుంది. నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన గ్రహం సౌర కుటుంబంలో శని ఒక్కటే.<ref name="preserve">{{cite web|url=http://www.preservearticles.com/201101233659/saturn-the-most-beautiful-planet-of-our-solar-system.html|title=Saturn – The Most Beautiful Planet of our solar system|work=Preserve Articles|date=23 January 2011|accessdate=24 July 2011|archiveurl=https://www.webcitation.org/62D9uTOJ0?url=http://www.preservearticles.com/201101233659/saturn-the-most-beautiful-planet-of-our-solar-system.html|archivedate=5 October 2011|deadurl=no|df=}}</ref> శనిగ్రహ వలయాల్లో చిన్నచిన్న మంచు, రాళ్ళ ముక్కలు ఉంటాయి. దీనికి 62 ఉపగ్రహాలున్నాయి. అన్నీ మంచుతో కూడుకుని ఉంటాయి. వీటిలో టైటన్, ఎన్‌సెలాడస్ లలో గ్రహగర్భ చైతన్యం ఉంది.<ref>{{cite journal|last1=Kargel|first1=J.S.|title=Cryovolcanism on the icy satellites|journal=Earth, Moon, and Planets|volume=67|pages=101–113|date=1994|doi=10.1007/BF00613296|bibcode=1995EM&P...67..101K|type=Submitted manuscript}}</ref> టైటన్ సౌర వ్యవస్థ లోని అతిపెద్ద ఉపగ్రహాల్లో రెండవది. ఇది బుధ గ్రహం కంటే పెద్దది. గణనీయమైన స్థాయిలో వాతావరణం ఉన్న ఏకైక ఉపగ్రహం, టైటన్.
 
==== యురేనస్ ====
{{main|యురేనస్}}
 
: యురేనస్ (సూర్యుడి నుండి 19.2&nbsp;AU దూరం) ద్రవ్యరాశి {{earth mass|14}}. బాహ్య వ్యవస్థలోని గ్రహాల్లో ఇది అత్యంత తేలికైనది. ఇది సూర్యుని చుట్టూ దొర్లుతూ పరిభ్రమిస్తుంది; దీని భ్రమణాక్షం పక్కకు వంపు తిరిగి దాని పరిభ్రమణ కక్ష్యకు దాదాపు సమాంతరంగా ఉంటుంది. ఇతర పెద్ద గ్రహాల కంటే దీని గర్భం (కోర్) చల్లగా ఉంటుంది. చాలా తక్కువ ఉష్ణాన్ని అంతరిక్షం లోకి పంపిస్తుంది.<ref>{{cite journal|title=10 Mysteries of the Solar System|journal=[[Astronomy Now]]|volume=19|issue=8|page=65|date=2005|bibcode=2005AsNow..19h..65H|author1=Hawksett|first1=David|last2=Longstaff|first2=Alan|last3=Cooper|first3=Keith|last4=Clark|first4=Stuart}}</ref> యురేనస్‌కు 27 ఉపగ్రహాలున్నాయి. వీటిలో టైటానియా, ఓబెరాన్, అంబ్రియెల్, ఏరియెల్, మిరాండా లు పెద్దవి.
 
==== నెప్ట్యూన్ ====
{{main|నెప్ట్యూన్}}
 
: నెప్ట్యూన్ (సూర్యుడి నుండి {{val|30.1|u=AU}} దూరం), యురేనస్ కంటే కొద్దిగా చిన్నదైనప్పటికీ, ద్రవ్యరాశి ({{earth mass|17}}) దానికంటే ఎక్కువ. అంటే సాంద్రత యురేనస్ కంటే ఎక్కువ. యురేనస్ కంటే ఎక్కువఉష్ణాన్ని అంతరిక్షం లోకి పంపిస్తుంది. కానీ గురుడు, శనిల కంటే తక్కువ.<ref>{{Cite journal|title=Post Voyager comparisons of the interiors of Uranus and Neptune|author1=Podolak, M.|author2=Reynolds, R.T.|author3=Young, R.|date=1990|pages=1737–1740|issue=10|volume=17|doi=10.1029/GL017i010p01737|bibcode=1990GeoRL..17.1737P|journal=Geophysical Research Letters|type=Submitted manuscript}}</ref> నెప్ట్యూన్‌కు 14 ఉపగ్రహాలున్నాయి. వీటిలో అతి పెద్దదైన ట్రైటన్ ద్రవ నైట్రోజన్ బుగ్గలతో గ్రహగర్భ చైతన్యం ఉంది.<ref>{{cite web|title=The Plausibility of Boiling Geysers on Triton|author=Duxbury, N.S.|author2=Brown, R.H.|work=Beacon eSpace|date=1995|url=http://trs-new.jpl.nasa.gov/dspace/handle/2014/28034?mode=full|accessdate=16 January 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090426005806/http://trs-new.jpl.nasa.gov/dspace/handle/2014/28034?mode=full|archivedate=26 April 2009|df=}}</ref> పెద్ద ఉపగ్రహాల్లో ట్రైటన్ ఒక్కటే రెట్రోగ్రేడ్ కక్ష్యలో తిరుగుతుంది. నెప్ట్యూన్ కక్ష్యలో అనేక చిన్న గ్రహాలున్నాయి వీటిని నెప్ట్యూన్ ట్రోజన్‌లు అంటారు. ఇవి నెప్ట్యూన్‌తో 1:1 అనుకంపనలో ఉంటాయి
 
=== సెంటార్లు ===
సెంటార్లు మంచుతో కూడుకుని ఉన్న తోకచుక్కల వంటి ఖగోళ వస్తువులు. ఇవి సూర్యుని చుట్టూ అండాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటి సెమి-మేజర్ అక్షం గురుడి కంటే ఎక్కువ గాను (5.5&nbsp;AU) , నెప్ట్యూన్ కంటే తక్కువ గానూ (30&nbsp;AU) ఉంటుంది. అతి పెద్ద సెంటార్ ఐన 10199 చారిక్లో 250 కి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.<ref name="spitzer">{{Cite conference|title=Physical Properties of Kuiper Belt and Centaur Objects: Constraints from Spitzer Space Telescope|author1=John Stansberry|author2=Will Grundy|author3=Mike Brown|author4=Dale Cruikshank|author5=John Spencer|author6=David Trilling|author7=Jean-Luc Margot|booktitle=The Solar System Beyond Neptune|arxiv=astro-ph/0702538|pages=161|date=2007|bibcode=2008ssbn.book..161S}}</ref> మొట్ట మొదట కనుక్కున సెంటార్ 2060 చిరోన్‌ సూర్యుడికి దగ్గరగా వెళ్ళినపుడు తోకచుక్కలకు లాగానే తోక ఏర్పడుతుంది. అందుచేత దీన్ని తోకచుక్కగా (95P) వర్గీకరించారు.<ref>{{cite web|date=1995|author=Patrick Vanouplines|title=Chiron biography|work=Vrije Universitiet Brussel|url=http://www.vub.ac.be/STER/www.astro/chibio.htm|accessdate=23 June 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090502122306/http://www.vub.ac.be/STER/www.astro/chibio.htm|archivedate=2 May 2009|df=}}</ref>
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు