సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు, అనువాదాలు
→‎సెంటార్లు: +==తోకచుక్కలు==
పంక్తి 120:
=== సెంటార్లు ===
సెంటార్లు మంచుతో కూడుకుని ఉన్న తోకచుక్కల వంటి ఖగోళ వస్తువులు. ఇవి సూర్యుని చుట్టూ అండాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటి సెమి-మేజర్ అక్షం గురుడి కంటే ఎక్కువ గాను (5.5&nbsp;AU) , నెప్ట్యూన్ కంటే తక్కువ గానూ (30&nbsp;AU) ఉంటుంది. అతి పెద్ద సెంటార్ ఐన 10199 చారిక్లో 250 కి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.<ref name="spitzer">{{Cite conference|title=Physical Properties of Kuiper Belt and Centaur Objects: Constraints from Spitzer Space Telescope|author1=John Stansberry|author2=Will Grundy|author3=Mike Brown|author4=Dale Cruikshank|author5=John Spencer|author6=David Trilling|author7=Jean-Luc Margot|booktitle=The Solar System Beyond Neptune|arxiv=astro-ph/0702538|pages=161|date=2007|bibcode=2008ssbn.book..161S}}</ref> మొట్ట మొదట కనుక్కున సెంటార్ 2060 చిరోన్‌ సూర్యుడికి దగ్గరగా వెళ్ళినపుడు తోకచుక్కలకు లాగానే తోక ఏర్పడుతుంది. అందుచేత దీన్ని తోకచుక్కగా (95P) వర్గీకరించారు.<ref>{{cite web|date=1995|author=Patrick Vanouplines|title=Chiron biography|work=Vrije Universitiet Brussel|url=http://www.vub.ac.be/STER/www.astro/chibio.htm|accessdate=23 June 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090502122306/http://www.vub.ac.be/STER/www.astro/chibio.htm|archivedate=2 May 2009|df=}}</ref>
 
<br />
 
== తోకచుక్కలు ==
[[File:Comet-Hale-Bopp-29-03-1997_hires_adj.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Comet-Hale-Bopp-29-03-1997_hires_adj.jpg|thumb|[./https://en.wikipedia.org/wiki/Hale%E2%80%93Bopp Hale–Bopp] seen in 1997]]
{{main|తోకచుక్క}}తోకచుక్కలు సౌరవ్యవస్థ లోని చిన్న వస్తువుల్లో ఒకటి. ఇవి కొన్ని కిలోమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఎక్కువగా మంచుతో కూడుకుని ఉంటాయి. సూర్యుడి చుట్టూ ఇవి చాలా పెద్ద అండాకార కక్ష్యలో పరిభ్రమిస్తూంటాయి. ఈ కక్ష్యల పెరిహీలియన్ అంతర గ్రహాల కక్ష్యల లోపల ఉండగా, అప్‌హీలియన్ ప్లూటో బాఅగా ఆవల ఉంటుంది. తోకచుక్క ఆంతర సౌర వ్యవస్థ లోకి ప్రవేశించినపుడు సూర్యుడికి దగ్గరగా ఉండటం చేత, వాటి ఉపరితలంపై ఉండే మంచు కరిగి ఘన స్థితి నుండీ ఏకంగా ఆవిరౌతుంది (సబ్లిమేషన్). ఇది తోక లాగా అంతరిక్షంలోకి విస్తరిస్తుంది. ఇది ఉత్త కంటికే కనిపిస్తుంది. ఈ తోకను ఇంగ్లీషులో కోమా అంటారు.
 
తక్కువ కాలపు తోకచుక్కల కక్ష్య కాలం 200 సంవత్సరాల లోపే ఉంటుంది. దీర్ఘ కాల తోకచుక్కల కక్ష్యా కాలాం వేల సంవాత్సరాలు ఉంటుంది. స్వల్పకాలిక తోకచుక్కలు కైపర్ పట్టీలోను, హేల్ బాప్ వంటి దీర్ఘ కాలిక తోకచుక్కలు ఊర్ట్ మేఘంలోనూ ఉద్భవిస్తాయని భావిస్తున్నారు. క్రూట్జ్ సన్‌గ్రేజర్స్ వంటి చాలా తోకచుక్కల సమూహాలు ఒకే మాతృక విచ్ఛిన్నం కావడంతో ఉద్భవించాయి.<ref>{{cite journal|author=Sekanina, Zdeněk|date=2001|title=Kreutz sungrazers: the ultimate case of cometary fragmentation and disintegration?|volume=89|journal=Publications of the Astronomical Institute of the Academy of Sciences of the Czech Republic|pages=78–93|bibcode=2001PAICz..89...78S}}</ref> హైపర్‌బోలిక్ కక్ష్యల్లో పరిభ్రమించే తోకచుక్కలు సౌర కుటుంబానికి ఆవల ఉద్భవిస్తాయి. కానీ వాటి కక్ష్యలను కచ్చితంగా నిశ్చయించడం కష్టం.<ref name="hyperbolic">{{cite journal|last=Królikowska|first=M.|date=2001|title=A study of the original orbits of ''hyperbolic'' comets|journal=[[Astronomy & Astrophysics]]|volume=376|issue=1|pages=316–324|doi=10.1051/0004-6361:20010945|bibcode=2001A&A...376..316K}}</ref> సూర్యుడి కారణంగా తమలో ఉన్న మంచునంతటినీ కోల్పోయిన తోకచుక్కలను ఏస్టెరాయిడ్లుగా వర్గీకరించారు.<ref>{{cite journal|last1=Whipple|first1=Fred L.|title=The activities of comets related to their aging and origin|journal=[[Celestial Mechanics and Dynamical Astronomy]]|volume=54|issue=1–3|pages=1–11|date=1992|doi=10.1007/BF00049540|bibcode=1992CeMDA..54....1W}}</ref>
 
== సౌర కుటుంబం బొమ్మల కొలువు ==
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు