బత్తిని మొగిలయ్య గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
కొంత శైలి సవరణలు చేసి వికీకరణ చేశాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 30:
}}
 
'''బత్తిని మొగిలయ్య గౌడ్''' ఓరుగల్లుకు చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు. రజాకార్లను ఎదిరించి పోరాడాడు.
'''బత్తిని మొగిలయ్య గౌడ్''' ఒంటిచేతితో రెండు వందల మందికి పైగా [[రజాకార్లు|రజాకార్ల]]ను ఊచకోత కోసి హోరాహోరీగా తలపడి అభిమన్యుడిలా నేలకొరిగిన ఓరుగల్లు గౌడ కులం లోని ఒక అసాధారణ రక్త తర్పణం చేసిన వీరోచితమైన స్వాతంత్రసమరయోదుడు పోరాట వీరుడి చరిత్ర<ref>https://www.youtube.com/watch?v=ScNrxnVawLY</ref>.
 
== బాల్యం, కుటుంబం ==
బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ తూర్పు కోట నివాసి. తల్లిదండ్రులు బత్తిని చెన్నమ్మ, మల్లయ్యలు,అన్న బత్తిని రామస్వామి గౌడ్.చెన్నమ్మ, మల్లయ్య ధంపతుల ఐదవ సంతానంగా ఈ కాలపు దీరుడిగా ఖిల్లా ఓరుగల్లులో పాఠాలు నేర్చుకున్నాడు. మొగిలయ్య కోట బడిలో 4వ తరగతి వరకు చదివాడు. బత్తిని మొగిలయ్య గౌడ్, బత్తిని రామస్వామి గౌడ్ లిద్దరు ఆర్యసమాజ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు.
 
==అందరితో ==
పంక్తి 46:
 
==బలిదానం==
అప్పుడే సుమారు రెండు వందల మంది [[రజాకార్లు]], వారి అనుయాయులు మారణాయుధాలతో ఖాసీం షరీఫ్ అనే రజాకార్ నాయకుని అధ్వర్యంలో, జెండా ఎత్తిన నాయకులను చంపడానికి నిజాం అనుకూల నినాదాలను చేస్తూ జెండా ఎత్తిన ప్రాంతానికి చేరుకున్నారు. ఎగిరిన జెండా ను చూసిన [[రజాకార్లు|రజాకార్ల]] కోపం కట్టలు తెంచుకుంది. జెండా ను దించి కాళ్ళతో తొక్కి ,తగలబెట్టి,అంతా కలిసి బత్తిని రామస్వామి గౌడ్ ఇంటి వైపు అరుస్తూ, తిడుతూ వచ్చారు. జెండా ఎత్తిన ప్రధాన నాయకులైన హయగ్రీవ చారి,భూపతి కృష్ణమూర్తి, పంచాయతి ఇన్‌స్పెక్టర్ కె.సమ్మయ్య, వెంకట్రాంనర్సయ్య, యం.యస్.రాజలింగం వీరందరూ బత్తిని రామస్వామి ఇంట్లో చాయ్ తాగుతూ, భవిష్యత్తు జెండా వందన కాంగ్రెస్ కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్నారు. అప్పుడు ఆ ఇంటి చుట్టూ మోహరించిన [[రజాకార్లు]] ఇంట్లోకి వెళ్ళి వాళ్లను చంపే ప్రయత్నం చేసారు. లోపల ఉన్న భూపతి కృష్ణమూర్తి కాంపౌండ్ కు గొళ్లెం పెట్టాడు. [[రజాకార్లు]] రాళ్ళతో ఇంట్లోని వాళ్ళ మీద దాడి మొదలుపెట్టారు. ఏ క్షణమైన తలుపులు బద్దలు కొట్టి, జెండా ఎత్తిన నాయకులందరిని మట్టుబెట్టాలని చూసారు. జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న మొగిలయ్య, అనంతరం తాళ్లెక్కడానికి తాటి వనానికి వెళ్లాడు. మొగిలయ్య భార్య లచ్చవ్వ 15 రోజుల బాలింత, పురిటి బిడ్డతో మంచంపై ఉంది. మొగిలయ్య భార్య లచ్చవ్వ, తల్లి చెన్నమ్మ ఈ దాడితో భీతిల్లి పోయారు. శనిగరం పుల్లయ్య అనే ఆర్యసమాజ్ కార్యకర్త తాటివనంలో ఉన్న మొగిలయ్య ను కలిసి రజాకార్ల దాడి గురించి చెప్పాడు. దాడి గురించి విన్న మొగిలయ్య ఒక్క క్షణం నిశ్చేష్టుడై, మరుక్షణం తన ఇంటివైపు పరుగుతీసాడు. రజాకార్ల దాడి భీభత్సంగా సాగుతుంది. ఏ క్షణమైన ఆ ఇంట్లో ఉన్న వాళ్లంతా వందల మంది రజాకార్ల చేతుల్లో చనిపోయేట్టుగా ఉందని భావించి, తన ఇంటి వెనుక దర్వాజా నుండి రజాకార్ల కంటబడకుండ ఇంట్లోకి వెళ్ళి, మెరుపు వేగంతో ఇంటి సూరు లోని తల్వార్ ను సర్రున గుంజి, మెరుపులా రజాకార్ల సమూహం మధ్య ప్రత్యక్ష మయ్యాడు.కాకతీయ ప్రతాపానికి ప్రతీకగా నిలిచి వైరి వర్గాల కరవాలాల కత్తుల కవాతులలో మునిగి తేలిన యుద్ద భూమి పై నిలిచిన మొగిలయ్య అరుస్తూ [[రజాకార్లు|రజాకార్ల]] మూకపై పడి నరకడం మొదలుపెట్టాడు. ఈ దాడికి నాయకత్వం వహించిన ఖాసీం షరీఫ్ తో సహా, పచ్చి నెత్తురు తాగే రజాకార్లంతా చీమల పుట్ట చెదిరినట్లుగా చెదిరిపోయారు.నెత్తురు రుచి మరిగిన మానవ మృగాల మధ్య మొగిలయ్య వీరవిహారం చేసారు. దూరంగా చెదిరిపోయిన [[రజాకార్లు]] తిరిగి మొగిలయ్య పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. రెండవసారి జరిగిన దాడిలో మొగిలయ్య గౌడ్ దే పైచేయి, కానీ మూడవసారి జరిగిన దాడిలో ఖాసీం షరీఫ్ బల్లెంతో మొగిలయ్య వైపు వస్తున్నప్పుడు, మొగిలయ్య తన శత్రువును నరక డానికి తన కత్తిని పైకెత్తాడు.అది తన ఇంటి ముందు గల పందిరి గుంజల మధ్య చిక్కుకుంది. ఇదే అదనుగా భావించిన షరీఫ్ తన బల్లెంతో మొగిలయ్య గుండెల మీద పొడిచాడు. అది మొదలు [[రజాకార్లు|రజాకార్ల]] మూకుమ్మడి దాడిలో మొగిలయ్య అమరుడైనాడు.
 
==కౄరత్వం==
మొగిలయ్య గౌడ్ ను చంపిన షరీఫ్ అతని గుండెల మీద చిమ్మిన రక్తాన్ని అరుస్తూ, ఆనందంగా తన ముఖమంతా పులుముకున్నాడు. ఖాసీం షరీఫ్ ని అతని అనుయాయులు, తమ భుజాలపై మోస్తూ ఇప్పటి వరంగల్ చౌరస్తా కు ఊరేగింపు గా తీసుకొచ్చారు. అప్పటి వరంగల్ తాలుక్ దార్ (కలెక్టర్) అబ్దుల్ మొహిత్ మిల్ ఎదురేగి, హంతకుడైన ఖాసీం షరీఫ్ కు పూలమాల వేసి ఆలింగనం చేసుకున్నాడు.
 
==స్మారక భవనం==
జెండా ఎత్తిన నాయకులకు ప్రాణ భిక్ష పెట్టి, 25సంవత్సరాల వయస్సులోనే అమరుడైన నిష్కళంక దేశభక్తుడు బత్తిని మొగిలయ్య గౌడ్ అమరత్వం చిరస్మరణీయంగా మిగిలిపోవాలని వరంగల్ నడిబొడ్డున గల జెపిఎన్ రోడ్ లో 1954 లో మొగిలయ్య స్మారక భవనాన్ని ప్రజలు ఏర్పాటు చేసారు. ఇది గౌడ కులం లోని ఒక అసాధారణ పోరాట వీరుడైన బత్తిని మొగిలయ్య గౌడ్ చరిత్ర. అనేక చారిత్రక సంఘటనల నేపథ్యంలో త్యాగాలకు,బలిదానాలకు ప్రతీకలుగా నిలిచిన సాధారణ వ్యక్తులు, అసమాన వీరులుగా మారి సమాజానికి మార్గదర్శకులైన వారి జీవిత చరిత్రలను అజరామరం చేయాలి.
 
==మూలాలు==
* [https://www.youtube.com/watch?v=ScNrxnVawLY యూట్యూబ్ లో బత్తిని మొగిలయ్య గౌడ్ గురించిన వీడియో]
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* [https://www.youtube.com/watch?v=ScNrxnVawLY యూట్యూబ్ లో బత్తిని మొగిలయ్య గౌడ్ గురించిన వీడియో]
 
[[వర్గం:మరణాలు]]